Janhvi Kapoor: మాజీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆధ్యాత్మిక సేవలో జాన్వీ కపూర్

మాజీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆధ్యాత్మిక సేవలో జాన్వీ కపూర్

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా వెండితెరకు పరిచయమై… మంచి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor). 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ… ఘోస్ట్ స్టోరీస్, రూహీ, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

Janhvi Kapoor – శిఖర్ పహారియాతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తున్న జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ తరచూ శిఖర్ పహారియాలో కలిసి పలు ఫార్టీలు, ఫంక్షన్లు, ఫారిన్ వెకేషన్స్ లో కూడా కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. మధ్యలో వీరిద్దరి మధ్య విభేధాలు తలెత్తి డేటింగ్ కు బ్రేకప్ కూడా చెప్పారనే టాక్ కూడా నడుస్తోంది.

అయితే తాజాగా జాన్వీ కపూర్… దేశంలో పలు ప్రధాన ఆలయాలు సందర్శిస్తూ ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జాన్వీ… తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించింది. సంప్రదాయ దుస్తుల్లో మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్లిన అతిలోక సుందరి కుమార్తె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ డేటింగ్ ?

అయితే ఈ ఆధ్యాత్మిక సేవల్లో జాన్వీ కపూర్ తో పాటు తన మాజీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా ప్రత్యక్షమవడం మరోసారి వీరి డేటింగ్ వ్యవహారం తెరమీదకు వస్తుంది. వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి ఎక్కడా ప్రస్తావించనప్పటికీ… చాలా ఏళ్ల క్రితమే జాన్వీతో శిఖర్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

Also Read : Daggubati Rana: సైలంట్ గా ఓటీటీలో ప్రత్యక్షమైన రానా తమ్ముడు అభిరామ్

Janhvi KapoorShikhar Pahariya
Comments (0)
Add Comment