Japan Movie : సొసైటీపై జ‌పాన్ సెటైర్ 

స్ప‌ష్టం చేసిన  న‌టుడు కార్తీ

Japan Movie : ఎవ‌రైనా జ‌పాన్ అంటే దేశం పేరు అనుకుంటారు. కానీ కోలీవుడ్ లో త‌యారైన చిత్రం. ఇందులో న‌టించింది ఎవ‌రో కాదు పాపుల‌ర్ హీరో కార్తీ. త‌ను డిఫ‌రెంట్ రోల్స్ ను ఎంచుకుంటాడు. స‌మాజం ప‌ట్ల ఎంతో కొంత బాధ్య‌త అన్న‌ది ఉండాల‌ని ఫీల్ క‌లిగిన న‌టుడు కార్తీ.

Japan Movie Updates

టాలీవుడ్ కు సుప‌రిచితుడే. ఏదైనా సున్నితంగా చెప్ప‌డంలో స్పెష‌ల్. తాజాగా త‌ను జ‌పాన్ చిత్రంలో కీ రోల్ పోషించాడు. వైవిధ్య‌మైన క‌థ‌లు అంటే ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తాడు కార్తీ. వాటికే ఎక్కువగా ప్ర‌యారిటీ ఇస్తాడు.

ఇక  జ‌పాన్ చిత్రం(Japan Movie) పూర్తిగా స‌మాజంపై ఎక్కు పెట్టిన వ్యంగ్యాస్త్రం అంటూ స్ప‌ష్టం చేశాడు న‌టుడు కార్తీ. త‌న‌కు మంచి పాత్ర ఇచ్చాడు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. ఆ మ‌ధ్య‌న వ‌చ్చిన పొన్నియ‌న్ సెల్వ‌న్ సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది.

తాజాగా దీపావ‌ళి పండుగ‌కు రాబోయే జ‌పాన్ పై కూడా భారీగా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ మూవీ త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు న‌టుడు కార్తీ. ఇక జ‌పాన్ చిత్రానికి ద‌ర్శ‌కుడు రాజు మురుగ‌న్. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్ర‌కాష్ బాబు, ప్ర‌భు  నిర్మించారు.

వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు జ‌పాన్ ను తీశాడ‌ని చెప్పారు న‌టుడు కార్తీ. అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నాడు.

Also Read : Thalapathy 68 Vijay : ఎయిర్ పోర్ట్ లో ద‌ళ‌ప‌తి వైర‌ల్

Comments (0)
Add Comment