Jasprit Bumrah : కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే అరుదైన టీమిండియా బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అలియాస్ స్పీడ్ స్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. తను గతంలో రోహిత్ శర్మ గాయ పడడంతో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. మెరుగైన సక్సెస్ రేట్ కూడా ఉంది. అద్భుతమైన ప్రతిభతో రాణిస్తున్నాడు. తను మైదానంలోకి దిగాడంటే వికెట్లు కూల్చడం పక్కా. అంత పర్ ఫెక్ట్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు బుమ్రా.
Jasprit Bumrah…
ఈ తరుణంలో ఇప్పుడు టీమిండియా టెస్టు జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు రోహిత్ శర్మ. తన సారథ్యంలో బుమ్రా(Jasprit Bumrah) కూడా సూపర్ షో చేశాడు. ఇదే క్రమంలో తన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్స్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. స్కిప్పర్ బరిలో జస్ ప్రీత్ బుమ్రాతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ , శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. హెడ్ కోచ్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
బుమ్రా బెస్ట్ ఛాయిస్ అయితే గనుక తను బౌలింగ్ పరంగా ఫోకస్ పెట్టలేడని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి . ఇదే క్రమంలో ఉన్నట్టుండి కొత్త పేరు పరిగణలోకి తీసుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. ప్రధానంగా చెప్పు కోవాల్సింది గౌతమ్ గంభీర్ గురించి. తను కేవలం ప్రతిభను ఆధారంగానే పరిగణలోకి తీసుకుంటాడు. పైరవీలు, ఇంకొకరి పెత్తనాన్ని, సిఫారసులను పట్టించుకోడు. దీంతో బుమ్రా బెస్ట్ ఛాయిసా కాదా అనేది ముఖ్యం.
Also Read : Gautham Gambhir Best Choice :శ్రేయస్ అయ్యర్ వైపు గంభీర్ చూపు