Jawan Movie : బాద్ షా జ‌వాన్ వ‌సూళ్ల ఊచ‌కోత‌

రూ. 600 కోట్ల క్ల‌బ్ లోకి చేరువ‌గా

Jawan Movie : త‌మిళ సినీ రంగానికి చెందిన క్రియేటివ్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ తీసిన జ‌వాన్ దూసుకు పోతోంది. ఊహించ‌ని రీతిలో వ‌సూళ్ల సునామీ సృష్టిస్తోంది. సెప్టెంబ‌ర్ 7న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైంది జ‌వాన్.

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు షారుక్ ఖాన్ , త‌మిళ అందాల తార న‌య‌న‌తార‌, లవ్లీ బ్యూటీ దీపికా ప‌దుకొనే , విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి క‌లిసి న‌టించిన ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా చేసింది.

Jawan Movie Trending in Pan India

ప్ర‌త్యేకించి ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌, బాద్ షా స్టార్ డ‌మ్ ను అద్భుతంగా తెర మీద ప్ర‌జెంట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఖాన్ కు ఈ ఏడాది బిగ్ స‌క్సెస్ ఇచ్చిన సినిమాల‌లో జ‌వాన్(Jawan Movie) రెండో చిత్రం కావ‌డం విశేషం. ఇదే సంవ‌త్స‌రంలో షారుక్ ఖాన్ తో పాటు దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన ప‌ఠాన్ చిత్రం విడుద‌లై రికార్డు బ్రేక్ చేసుకుంది.

కేవ‌లం 5 రోజుల్లోనే రూ. 585 కోట్లు వ‌సూలు చేసింది. త్వ‌ర‌లోనే రూ.600 కోట్ల క్ల‌బ్ లోకి చేరుకునేందుకు ప‌రుగులు తీస్తోంది. ఇక క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే 1వ రోజు రూ. 125.05 కోట్లు సాధించింది.

2వ రోజు రూ. 109.24 కోట్లు, 3వ రోజు రూ. 140.17 కోట్లు, 4వ రోజు రూ. 156.80 కోట్లు, 5వ రోజు రూ. 52.39 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా జ‌వాన్ రూ. 583.65 కోట్లు సాధించి చ‌రిత్ర సృష్టించింది.

Also Read : Trisha Krishnan Confirmed : అజిత్ కు జోడీగా త్రిష కృష్ణ‌న్

Comments (0)
Add Comment