Jawan OTT Record : బాద్ షా ఓటీటీలో షెహ‌న్ షా

రికార్డ్ స్థాయిలో వ్యూయ‌ర్ షిప్

Jawan OTT Record : త‌మిళ సినిమా రంగానికి చెందిన యంగ్ అండ్ ఎన‌ర్జ‌టిక్ , డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ తీసిన జ‌వాన్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా దుమ్ము రేపుతోంది. బాద్ షా షారుక్ ఖాన్ , న‌య‌న తార‌, విజ‌య్ సేతుప‌తి క‌లిసి న‌టించిన జ‌వాన్ రికార్డుల మోత మోగించింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ ఏడాది రెండు సినిమాలు బాద్ షాకు తీపి గుర్తుల‌ను మిగిల్చాయి.

Jawan OTT Record Viral

చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన ప‌ఠాన్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1,000 కోట్లు క‌లెక్ష‌న్స్ సాధించింది. ఇదే స‌మ‌యంలో తాజాగా విడుద‌లైన జ‌వాన్(Jawan) ఊహించ‌ని రీతిలో ప‌ఠాన్ ను మించి పోయింది. రూ. 1,060 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింద‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఇందులో సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు పొందిన న‌య‌న తార కీ రోల్ పోషించింది. ఆమె తో పాటు ఓ పాట‌లో మెరిసింది దీపికా ప‌దుకొనే. ఇదే స‌మ‌యంలో జ‌వాన్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఏకంగా ఏ హిందీ సినిమాకు రానంత వ్యూయ‌ర్ షిప్ బాలీవుడ్ బాద్ షా కింగ్ షారుక్ ఖాన్ మూవీకి ద‌క్కింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. దీనిని ధ్రువీక‌రించింది జ‌వాన్ టీం.

ఇదిలా ఉండ‌గా షారుక్ ఖాన్ మాట్లాడుతూ ఈ క్రెడిట్ అంతా త‌న‌ది కాద‌ని జ‌వాన్ ను తీసిన డైరెక్ట‌ర్ అట్లీకే ద‌క్కుతుంద‌న్నాడు. జ‌వాన్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్.

Also Read : Karthika Nair: కాబోయే భర్తను పరిచయం చేసిన ‘రంగం’ బ్యూటీ

Comments (0)
Add Comment