Jaya Prada: ప్రభాస్‌ ‘ఫౌజి’ లో ముఖ్యపాత్రలో సీనియర్ నటి జయప్రద ?

ప్రభాస్‌ 'ఫౌజి' లో ముఖ్యపాత్రలో సీనియర్ నటి జయప్రద ?

Jaya Prada: ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘సీతారామం’ తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు హను రాఘవపూడి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

Jaya Prada Movie Updates

ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని మధురై, కారైకుడి లొకేషన్స్‌లోప్రారంభమైంది. అయితే ప్రభాస్‌ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. కాగా ఈ సినిమాలో సీనియర్ నటి జయప్రద ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆల్రెడీ మధురై షెడ్యూల్‌ లో ఆమె జాయిన్‌ అయ్యారని, ఇమాన్వి–జయప్రదల కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. అక్టోబరు చివర్లో ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్‌ కూడా పాల్గొంటారట.

Also Read : Game Changer: ‘గేమ్ ఛేంజర్‌’ నుంచి ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో రిలీజ్ !

Hanu RaghavapudiJaya PradaPrabhas
Comments (0)
Add Comment