Jos Buttler Shocking :మెగా ఐపీఎల్ లో జోస్ బ‌ట్ల‌ర్ ఆడ‌తాడా..?

మే 26 లోపు తిరిగి రావాల‌న్న ఈసీబీ

Jos Buttler : హైద‌రాబాద్ – టాటా ఐపీఎల్ 2025లో విదేశీ ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది. దీనికి కార‌ణం వాళ్ల కాంట్రాక్టు బీసీసీఐతో కేవ‌లం మే 26వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఉంది. దీంతో భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల ప‌రిస్థితుల దృష్ట్యా ఐపీఎల్ ను వాయిదా వేసింది బీసీసీఐ. ఇరు దేశాలు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం చేసుకోవడంతో తిరిగి ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

Jos Buttler Shocking

ఇప్ప‌టి వ‌ర‌కు టోర్నీలో 60 కీల‌క లీగ్ మ్యాచ్ లు పూర్త‌య్యాయి. ఇంకా 15 మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ వేదిక‌ను కూడా మార్చేసింది బీసీసీఐ. జూన్ 3న గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ త‌రుణంలో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ , న్యూజిలాండ్, శ్రీ‌లంక, త‌దిత‌ర దేశాల‌కు చెందిన క్రికెట‌ర్లు ప్ర‌స్తుతం ఐపీఎల్ లో భాగ‌స్వామ్యం పంచుకున్నారు.

ఈ త‌రుణంలో ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు త‌మ దేశానికి చెందిన ఆట‌గాళ్లు వెంట‌నే తిరిగి రావాల‌ని కోరాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ ఆటగాళ్లు పెట్టే బేడా స‌ర్దుకోవాల‌ని , ఇంగ్లండ్ కు వెంట‌నే రావాల‌ని కోరింది. దీంతో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జోస్ బ‌ట్ల‌ర్(Jos Buttler) ఐపీఎల్ లో ఆడేది క‌ష్ట‌మేన‌ని స‌మాచారం. ఇప్ప‌టికే స్కోర్ చేయ‌డంలో టాప‌ర్ గా కొన‌సాగుతున్నాడు. ఆ జ‌ట్టుకు త‌ను ప్ర‌ధాన బ‌లం. త‌ను లేక పోతే ఇబ్బంది ఏర్ప‌డ‌క త‌ప్ప‌దు.

Also Read : Rahul Dravid Sensational :శాంస‌న్ ను ద్ర‌విడ్ ప‌క్క‌న పెట్టాడా..?

BreakingCricketInternational NewsJos ButlerUpdatesViral
Comments (0)
Add Comment