Hero Jr NTR :జ‌న్మంటూ ఉంటే చెఫ్ గా పుట్టాల‌ని ఉంది

స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ కామెంట్స్

Jr NTR : ప్యాన్ ఇండియా హీరోగా పేరు పొందిన జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr NTR) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను న‌టించిన దేవ‌ర మూవీ బిగ్ స‌క్సెస్ అయ్యింది. దీనిని సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ. ఇదే స‌మ‌యంలో స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న డ్రాగ‌న్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఏ మాత్రం వీలు చిక్కినా ఈవెంట్ కు హాజ‌ర‌వుతున్నాడు. మ‌రో వైపు త‌న సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రాముల‌మ్మ క‌లిసి న‌టించిన అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో కూడా పాల్గొననున్నాడు.

Jr NTR Viral Comments

వ‌రుస మూవీస్ చేసుకుంటూ పోతున్నాడు. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr NTR). ఇంకో వైపు త‌న బాబాయి నంద‌మూరి బాల‌కృష్ణ కొడుకుల‌తో పోటీ ప‌డుతున్నాడు. త‌ను కూడా దున్నేస్తున్నాడు. వ‌రుస హిట్స్ తో త‌న‌కు ఎదురే లేద‌ని చాటుతున్నాడు. అఖండ‌, భ‌గ‌వంత్ కేస‌రి, డాకూ మ‌హారాజ్ ఈ మూడు సిన‌మాలు బిగ్ స‌క్సెస్ అయ్యాయి. దీంతో అంద‌రూ హ్యాట్రిక్ బాల‌య్య అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.

ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో త‌ను న‌టించిన ఆర్ఆర్ ఆర్ ఎన్టీఆర్ కు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది. దేవ‌ర‌తో ప్యాన్ ఇండియా లెవ‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇంకో వైపు బాలీవుడ్ లోఎంట్రీ ఇచ్చాడు. వార్ 2తో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఆగస్టు 15న రలీజ్ కానుంద‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. ఇక డ్రాగ‌న్ జ‌న‌వ‌రి 9 , 2026లో రిలీజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.

ఇదిలా ఉండ‌గా దేవ‌ర మూవీని మార్చి 28న జ‌పాన్ లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చాడు. మ‌రో జ‌న్మంటూ ఉంటే చెఫ్ (వంట వాడి)గా పుట్టాల‌ని ఉంద‌న్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్.

Also Read : Popular Actress Smriti Irani :వెబ్ సీరీస్ లో న‌టించ‌నున్న స్మృతీ ఇరానీ

CommentsJr NTRViral
Comments (0)
Add Comment