Hero Jr NTR-Neel :తార‌క్ తో కీల‌క స‌న్నివేశాల‌పై నీల్ ఫోక‌స్

ఏప్రిల్ 22 నుంచి షెడ్యూల్ లో పాల్గొంటారు

Jr NTR : భార‌తీయ సినిమాను కేజీఎఫ్ మూవీతో షేక్ చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. ప్ర‌భాస్ తో తీసిన స‌లార్ రికార్డ్ సృష్టించింది. తాజాగా ద‌మ్మున్న హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr NTR) తో న్యూ మూవీ స్టార్ట్ చేశాడు. దీనికి సంబంధించిన కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి కాగా కీల‌క‌మైన సన్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఏప్రిల్ 22 నుంచి తార‌క్ షూటింగ్ లో పాల్గొంటాడ‌ని ప్ర‌క‌టించాడు. ఇంకా పేరు పెట్ట‌లేదు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు..అప్పుడే అంచ‌నాలు మించి పోయాయి.

Jr NTR – Prasanth Neel Movie

తార‌క్ తో తీసే మూవీని పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ప్ర‌శాంత్ నీల్. తాను తీసిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2, స‌లార్ సినిమాల‌కు మించి ఉండ‌బోతుంద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్ మాత్రం కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఇక మేకింగ్ , టేకింగ్ లో ప్ర‌త్యేక‌త చూపించే ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు ప్ర‌శాంత్ నీల్.

కొన్ని వారాల కింద జూనియ‌ర్ ఎన్టీఆర్ లేకుండా కొన్ని సీన్స్ చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. తాజాగా చేప‌ట్ట‌బోయే షూటింగ్ లో కీల‌క‌మైన , ప్ర‌ధాన‌మైన స‌న్నివేశాల‌ను ప్లాన్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు మూవీ మేక‌ర్స్. అయితే తాత్కాలికంగా డ్రాగ‌న్ అని పేరు పెట్టారు . ఇందులో రుక్మిణి వసంత్ కీ రోల్ పోషిస్తున్న‌ట్లు టాక్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ర‌వి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇది బ‌హుల భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే తెలిపారు ప్ర‌శాంత్ నీల్.

Also Read : Dragon OTT Sensational :ఓటీటీలో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ డ్రాగ‌న్ సెన్సేష‌న్

CinemaJr NTRprasanthneelUpdates
Comments (0)
Add Comment