Jr NTR : డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం డ్రాగన్. సినిమా షెడ్యూల్ పై ఫోకస్ పెట్టాడు దర్శకుడు. దీంతో కొంత బరువు పెరిగాడు తారక్(Jr NTR). దీనిని గమనించిన దర్శకుడు వెంటనే తగ్గాల్సిందేనంటూ సూచించాడు. దీంతో మనోడు గత్యంతరం లేక బరువు తగ్గడంపై ఫుల్ ప్రాక్టీస్ చేశాడు. తను చేసిన కృషి ఫలించింది. తారక్ ఏకంగా 18 కిలోలు తగ్గాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Jr NTR Weight Loss For Dragon Movie
భారతీయ సినిమా రంగంలో టాప్ హీరోస్ అంతా ఫిజిక్ పై ఎక్కువగా దృష్టి పెడతారు. ఆ మధ్యన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అరవింద సమేతలో జూనియర్ ను చాలా డిఫరెంట్ గా చూపించాడు. అంతేకాదు తన బాడీని ప్రదర్శించేలా చేయడం, దానికి ఎక్కువగా ఆదరణ లభించడం, ఫ్యాన్స్ నుంచి మెచ్చుకోలు రావడంతో దానినే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఇతర దర్శకులు కూడా. ఇక ప్రశాంత్ నీల్ టేకింగ్ , మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. తను తీయడమే డిఫరెంట్ జానర్ లో తీస్తాడు.
ఇప్పటికే తను యష్ తో తీసిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 , ప్రభాస్ తో తీసిన సలార్ దేనికదే బిగ్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం యశ్ టాక్సిక్ లో నటిస్తుండగా తారక్ పూర్తిగా డ్రాగన్ పైనే కన్నేశాడు. దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్ కూడా షేక్ చేస్తోంది ఈ రాబోయే మూవీ గురించి. మరో వైపు దర్శక ధీరుడు జక్కన్న మహేష్ బాబుతో మూవీ తీస్తున్నాడు. రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది.
మరో వైపు హీరోలే కాదు హీరోయిన్లు కూడా తమ బాడీ గురించి ఎక్కువగా శ్రద్ద తీసుకుంటున్నారు. వారిలో టాప్ హీరోయిన్లుగా పేరొందిన విద్యా బాలన్, ఖుష్బూ, జ్యోతిక ఉన్నారు. ఇక బాలీవుడ్ కు సంబంధించి కరణ్ జోహార్ ఈ మధ్యన మరీ స్లిమ్ గా కనిపిస్తుండగా సల్మాన్ ఖాన్ తన కండలను మరింత పెంచేందుకు ట్రై చేస్తుండడం విశేషం. ఐదు నెలల్లో తాను పద్దెనిమిది కేజీలు తగ్గానంటూ చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్.
Also Read : Hero Allu Arjun-AISF :విద్యా సంస్థల ప్రమోషన్స్ ఇబ్బందుల్లో నటులు