చెన్నై – ప్రముఖ నటుడు, ఇలయ నాయగన్ కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి స్వయంగా తాను దాఖలు చేసిన పత్రాలను అందజేశారు నటుడు. తమిళనాడు రాజకీయాలలో ఇది ఎవరూ ఊహించని పరిణామం. త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.
గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కమల్ హాసన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు డీఎంకేకు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ తరపున ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు. ఇందులో భాగంగా ఇవాళ ఇళయ నాయగన్ దరఖాస్తు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా ఆయన గతంలో తన నామినేషన్‌ను వాయిదా వేసుకున్నారు. కాగా సభ్యుల పదవీకాలం జూన్ 24 నాటితో ముగుస్తుంది. కొత్త సభ్యులకు ఎన్నికల రోజుగా జూన్ 19ని ఎన్నికల సంఘం నిర్ణయించింది. డీఎంకే పార్టీకి ఎన్నికల మిత్రుడైన కమల్ హాసన్ ను పెద్దల సభకు పంపించేందుక సిద్దమయ్యారు సీఎం.
కమల్ హాసన్ తో పాటు మరో ముగ్గురు కూడా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా తన చిత్రం థగ్ లైఫ్ రిలీజ్ సందర్బంగా జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తమిళం లోంచి కన్నడ పుట్టిందని పేర్కొన్నారు. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. కమల్ హాసన్ 2018లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) ను ఏర్పాటు చేశాడు.