వివాదాస్పద నటిగా పేరు పొందిన కంగనా రనౌత్ ప్రస్తుతం వైరల్ గా మారారు. నిత్యం ట్వీట్లతో హోరత్తిస్తూ ప్రతిపక్షాలపై లేనిపోని కామెంట్స్ చేస్తూ వస్తోంది ఆమె. తాజాగా ఈ ఏడాదిలో ఆమె తమిళంలో సీక్వెల్ సినిమా చంద్రముఖిలో నటించింది. ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు.
ఆమె ప్రస్తుతం తేజస్ హిందీ మూవీలో నటించింది. ఇది నిజ జీవితంలో పైలట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే కంగనా రనౌత్ భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ అయ్యింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలను తను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి. తేజస్ చిత్రాన్ని ఆర్ఎస్వీపీ నిర్మించారు. టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ నటించింది. సర్వేష్ మేవారా ఈ చిత్రానికి కథతో పాటు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 27న తేజస్ మూవీ రిలీజ్ కానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ తేదీని కూడా ఖరారు చేశారు.
ప్రతి సైనికుడికి ఇది స్పూర్తి దాయకంగా ఉంటుందని ఈ సందర్బంగా పేర్కొన్నారు నటి కంగనా రనౌత్ .