Kangana Shocking Comments :నోరు పారేసుకున్న కంగ‌నా ర‌నౌత్

జెన్నిఫ‌ర్ లోపెజ్ పై షాకింగ్ కామెంట్స్

Kangana : బాలీవుడ్ లో వివాద‌స్ప‌ద న‌టిగా గుర్తింపు పొందారు న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్(Kangana). త‌ను నిత్యం వివాదాల‌లో ఇరుక్కోవ‌డం, అందుకు హిందువుల మ‌ద్ద‌తు పొంద‌డం ష‌రా మూమూలే. త‌ను న‌ట‌నా ప‌రంగా కీల‌క‌మైన పాత్ర‌లలో న‌టిస్తున్న‌ప్ప‌టికీ ఏదో ఒక అంశంతో ముందుకు రావ‌డం, దాని గురించి వ్యాఖ్యానించ‌డం, దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌లు జ‌రిగేలా చేయ‌డం ప‌నిగా పెట్టుకుంది.

Kangana Ranaut Shocking Comments

నిత్యం సోష‌ల్ మీడియాలో అల‌ర్ట్ గా, యాక్టివ్ గా ఉంటుంది. త‌నకు తోచిన వెంట‌నే ఎవ‌రినైనా స‌రే ఏకి పారేస్తుంది. దీంతో కంగ‌నా ర‌నౌత్ అంటేనే జ‌నం జ‌డుసుకునే ప‌రిస్థితి నెల‌కొంది. త‌న‌కు ఎవ‌రూ లెక్క‌లేద‌ని, తాను అన్నీ నిజాలే మాట్లాడతాన‌ని కానీ కొంద‌రు త‌న‌ను కావాల‌ని ట్రోల్ చేయ‌డం, విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేసింది కంగ‌నా ర‌నౌత్. త‌ను న‌టిగా, ఎంపీగా, ప్ర‌స్తుతం నిర్మాత‌గా కూడా కొత్త అవ‌తారం ఎత్తారు.

భార‌త దేశ చ‌రిత్ర‌లో గొప్ప నాయ‌కురాలిగా, ఎమ‌ర్జెన్సీ విధించిన ప్ర‌ధానమంత్రిగా పేరు పొందిన దివంగ‌త ఇందిరా గాంధీ నేప‌థ్యంతో ఎమ‌ర్జెన్సీ సినిమా తీసింది. ఇందులో ఇందిర పాత్ర‌ను త‌ను పోషించింది. ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మ‌రో వైపు తాజాగా నోరు పారేసుకుంది ఈ అమ్మ‌డు. జెన్నిఫ‌ర్ లోపెజ్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇప్పుడు తాను చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : Hero Salmaan-Sikandar :స‌ల్మాన్ సికింద‌ర్ టీజ‌ర్ సూప‌ర్

CommentsKangana RanautShockingViral
Comments (0)
Add Comment