కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినీ రంగంలో పరిచయం చేశాడు. తను యశ్ తో తీసిన కేజీఎఫ్ లో ఛాన్స్ ఇచ్చాడు. తను చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కేజీఎఫ్ 2 లో కూడా తీసుకున్నాడు. తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ ఆశించిన మేర ఆడలేక పోవడంతో కొంత నిరాశకు గురైంది ఈ లవ్లీ బ్యూటీ.
తమిళ సినీ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తో కలిసి కోబ్రాలో నటించింది. వర్కవుట్ కాలేదు. అది బోర్లా పడడంతో తనపై ఎఫెక్ట్ పడింది. అయితే నేచురల్ స్టార్ నాని కీ రోల్ పోషించిన హిట్ -3 సీక్వెల్ చిత్రంలో కీ రోల్ పోషించింది శ్రీనిధి శెట్టి. ఈ మూవీ బిగ్ సక్సెస్ అయ్యింది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇందులో అద్భుతంగా నటింప చేసేలా ట్రై చేశాడు దర్శకుడు.
తాజాగా శ్రీనిధి శెట్టికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. తనకు టాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తుండడంతో తనతో హీరోయిన్ గా ఓ టాప్ డైరెక్టర్ పాన్ ఇండియా మూవీలో కన్ ఫర్మ్ చేశాడని, ఈ మేరకు తనతో సంప్రదింపులు జరిపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ బంపర్ ఆఫర్ దక్కడంతో ముద్దుగుమ్మ ఫుల్ ఖుష్ అవుతోంది. అందాన్ని నమ్ముకుంటే వర్కవుట్ కాదు. కానీ నటనా పరంగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేక పోతే కష్టమే.