Kantara Chapter 1: త్వరలో కుందాపురానికి ‘కాంతారా: చాప్టర్‌-1’ !

త్వరలో కుందాపురానికి ‘కాంతారా: చాప్టర్‌-1’ !

Kantara Chapter 1:చిన్న సినిమాగా రిలీజై… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘కాంతారా: ది లెజెండ్‌’. ప్రముఖ కన్నడ హీరో రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు రాబట్టింది. దీనితో ఈ సినిమాకు ప్రీక్వెల్‌ గా ‘కాంతారా: చాప్టర్‌-1’ రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రీక్వెల్ కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసిన చిత్ర యూనిట్… త్వరలో షూటింగ్ కు రెడీ అవుతోంది.

Kantara Chapter 1:

‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గాకాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1(Kantara Chapter 1)’ను తెరకెక్కిస్తున్న హోంబలే ఫిలింస్… ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. గత కొన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు చిత్రీకరణ ప్రారంభించుకునేందుకు సిద్ధమైయ్యారు. వచ్చే వారంలోనే ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ మొదలు కానుందని సమాచారం. ఇందుకోసం కుందాపురలోని తీర ప్రాంతంలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేసింది చిత్ర యూనిట్. దాదాపు 20రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌ లో కుందాపుర పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోనూ… అక్కడ నిర్మించిన సెట్‌లోనూ కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం రిషబ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణం కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతమందిస్తుండగా… అరవింద్‌ కశ్యప్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

సోషల్ మీడియా దుమ్ము రేపిన ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్

‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1(Kantara Chapter 1)’ ఫస్ట్ లుక్ వీడియోను ఇంగ్లీషుతో కలిపి మొత్తం ఏడు భాషల్లో విడుదల చేసారు. ‘కాంతార – ఏ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్‍లో రిషబ్ శెట్టి లుక్ బీభత్సంగా ఉంది. కండలు తిరిగిన దేహంతో గెటప్ చాలా డిఫరెంట్‍గా ఉంది. దేహమంతా రక్తపు మరకలు, మెడలో రుద్రాక్షలు, చేతిలో త్రిశూలం, పొడవు జుట్టు, గడ్డంతో ఉగ్రరూపం దాల్చిన శివుడిలా రిషబ్‌ శెట్టి లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. కదంబల కాలంలో జన్మించిన ఓ లెజెండ్ కథగా ఫస్ట్ లుక్ టీజర్లో పేర్కొన్నారు మూవీ మేకర్స్. ఈ టీజర్ ఆరంభంలో కాంతారలో శివ (రిషబ్ శెట్టి) కనిపిస్తారు. తన తండ్రి (రిషబ్ శెట్టి) మాయమైన చోటికి వెళ్లి నిలబడతాడు. అక్కడి నుంచి చంద్రుడిని చూస్తారు. అప్పుడు ఈ లెజెండ్ (రిషబ్) ఆగమనం ఉంది. వెలుతురులో అన్నీ కనిపిస్తాయంటూ ఇంగ్లిష్‍లో వాయిస్ ఓవర్ ఉంది. దీనితో ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో అప్పట్లోనే ఓ దుమ్ము రేపింది.

Also Read:Akshay Kumar: ‘కన్నప్ప’ షూటింగ్ పూర్తి చేసిన అక్షయ్‌ కుమార్ !

Kantara Chapter 1Rishab Shetty
Comments (0)
Add Comment