క‌మ‌ల్ హాస‌న్ కామెంట్స్ కోర్టు సీరియ‌స్

మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తే ఎలా అని ఫైర్

ప్ర‌ముఖ త‌మిళ సినీ హీరో క‌మ‌ల్ హాస‌న్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ క‌ర్ణాట‌క హైకోర్టును కొంద‌రు ఆశ్ర‌యించారు. త‌మిళం నుంచే క‌న్న‌డ భాష పుట్టిందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై క‌న్న‌డిగులు భ‌గ్గుమ‌న్నారు. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో 38 ఏళ్ల సుదీర్గ విరామం త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి థ‌గ్ లైఫ్ తీశారు. దీనికి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొన్న క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇల‌య నాయ‌గ‌న్ చేసిన కామెంట్స్ పై విచార‌ణ చేప‌ట్టింది క‌ర్ణాట‌క హైకోర్టు. ఈ సంద‌ర్బంగా సీరియ‌స్ అయ్యింది. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే ముందు ఆలోచించు కోవాల‌ని సూచించింది. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది. ప్రజల మనోభావాలను దెబ్బ తీసేందుకు తన వాక్ స్వేచ్ఛ హక్కును దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది.

క‌న్న‌డ భాష త‌మిళంలో పుట్టింద‌న్న వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించు కోవాల‌ని వార్నింగ్ ఇచ్చింది న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కు. మంగ‌ళ‌వారం ప‌దునైన వ్యాఖ్య‌లు చేసింది ధ‌ర్మాస‌నం. మాట్లాడే ప‌దాల‌ను వెన‌క్కి తీసుకోలేక పోవ‌చ్చు..కానీ మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ చెప్పేందుకు వీలుంది. ఆ దిశ‌గా ఆలోచించాల‌ని పేర్కొంది కోర్టు. మీరు సాధార‌ణ‌మైన వ్య‌క్తి కాదు. న‌టుడిగా పేరు పొందారు. ఓ రాజ‌కీయ పార్టీని స్థాపించారు. ప్ర‌జాస్వామ్యంలో అంద‌రినీ ఒకేలా చూడాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ వివాదాల‌ను రాజేసి ల‌బ్ది పొంద‌డం మంచిది కాదని ధ‌ర్మాస‌నం ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

Comments (0)
Add Comment