Hero Karthi-Sardar 2 :స‌ర్దార్ 2 షూటింగ్ లో కార్తీ కాలికి గాయం

అర్దాంత‌రంగా ఆగి పోయిన షూటింగ్

Karthi : త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త క‌లిగిన న‌టుడు కార్తీ. త‌ను గ‌తంలో న‌టించిన స‌ర్దార్ మూవీ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. దీంతో మూవీ మేక‌ర్స్ స‌ర్దార్2 సీక్వెల్ షూటింగ్ శ‌ర వేగంగా న‌డుస్తోంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి కార్తీ(Karthi) షూటింగ్ లో ఉన్న‌ట్టుండి కాలికి గాయం కావ‌డంతో ఉన్న‌ట్టుండి ఆగి పోయింది.

Hero Karthi Injury at Shooting

బ‌హుముఖ ప్ర‌తిభ క‌లిగిన న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కార్తీ. వివిధ ర‌కాల పాత్ర‌ల‌ను పోషించ‌డం, వాటికి న్యాయం చేస్తూ వ‌స్తుండ‌డంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. పీఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు స‌ర్కార్. ఇది 2022లో విడుద‌లైంది. దీనికి కొన‌సాగింపుగా స‌ర్దార్ 2 చిత్రం చేస్తున్నాడు కార్తీ.

ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్ణాట‌కలోని మైసూర్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి కాలికి గాయం కావ‌డంతో కొంచెం రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించిన‌ట్లు స‌మాచారం. గాయ‌మైన వెంట‌నే ద‌ర్శ‌కుడు, ఇత‌ర సాంకేతిక వ‌ర్గం హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం గాయం ఏమంత తీవ్ర‌మైన‌ద‌ని కాద‌ని పేర్కొన్న‌ట్లు స‌మాచారం. అయితే తిరిగి న‌టించ‌డం కుద‌ర‌ని, కార్తీకి క‌నీసం వారం రోజుల విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని సూచించారు.
దీంతో ఉన్న‌ట్టుండి స‌ర్దార్ 2 షూటింగ్ నిలిపి వేయ‌క త‌ప్ప‌డం లేద‌ని డైరెక్ట‌ర్ స్ప‌ష్టం చేశాడు. దీంతో కార్తీ కాలికి గాయ‌మైన విష‌యం తెలుసుకున్న అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నెట్టింట్లో పోస్టులు చేస్తున్నారు.

Also Read : Hero Sandeep Kishan-Mazaka OTTత్వ‌ర‌లో ఓటీటీలోకి రానున్న మ‌జాకా

karthisardar 2UpdatesViral
Comments (0)
Add Comment