Hero Vijay Thalapathy-Subbaraju :విజ‌య్ కి క‌థ‌లు చెప్పినా వ‌ర్క‌వుట్ కాలేదు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ కామెంట్

Vijay Thalapathy : త‌మిళ సూప‌ర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం జ‌న నాయ‌గ‌న్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. టీవీకే పార్టీని ఏర్పాటు చేశాడు. భారీ ఎత్తున ఇందులో చేరుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ లెక్క‌కు మించి ఉన్నారు. ఈ సంద‌ర్బంగా చిత్రీక‌ర‌ణ జోరుగా కొన‌సాగుతుండ‌గా దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ద‌ర్శ‌కుడు. త‌ను ఇప్పుడు సూర్య‌, పూజా హెగ్డే తో క‌లిసి రెట్రో మూవీ తీశాడు. మే1న రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Karthik Subbaraju Comment about Vijay Thalapathy

తాను చాలా సార్లు ద‌ళ‌ప‌తి విజ‌య్(Vijay Thalapathy) ని క‌లిశాన‌ని చెప్పాడు. క‌లిసిన ప్ర‌తిసారి చాలా క‌థ‌లు వినిపించాన‌ని, కానీ అందులో ఏ ఒక్క‌టి వ‌ర్క‌వుట్ కాలేద‌న్నాడు. ఒక‌వేళ ఓకే చెప్పి ఉంటే విజ‌య్ ఆఖ‌రి సినిమా త‌న‌ది అయి ఉండేద‌న్నాడు కార్తీక్ సుబ్బ‌రాజ్. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మ‌రో వైపు సినీ ఇండ‌స్ట్రీలో టాప్ పొజిష‌న్ లో ఉన్న ద‌ళ‌ప‌తి విజ‌య్ ఉన్న‌ట్టుండి సినిమాల నుంచి నిష్క్ర‌మించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆయ‌న పూర్తి కాలం పాలిటిక్స్ లో ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ తీసుకున్న ఈ డెసిష‌న్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే విజ‌య్ చివ‌రి చిత్రం కోంస తాను స్క్రిప్ట్ ను ఎలా సిద్దంగా ఉంచుకున్నానో వెల్ల‌డించాడు. ఎన్నో క‌థ‌లు చెప్పినా వ‌ర్క‌ట్ కాక పోవ‌డం పూర్తిగా త‌న‌దే త‌ప్పన్నాడు కార్తీక్ సుబ్బ‌రాజ్. అయితే విజ‌య్ చివ‌రి చిత్రం ద‌ళ‌ప‌తి 69కి తాను స్క్రిప్ట్ ను సిద్దం చేశాన‌ని, ఆ త‌ర్వాత దానిని జ‌న నాయ‌గ‌న్ అని పిలిచార‌ని , దీనికి హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడ‌ని తెలిపాడు. విజ‌య్ తో మూవీ చేయాల‌న్న కోరిక క‌ల‌గా మిగిలి పోవ‌డం బాధ‌గా ఉంద‌న్నాడు.

Also Read : Hero Prabhas – Raja saab :రాజా సాబ్ పై డైరెక్ట‌ర్ కీల‌క అప్ డేట్

Commentskarthik subbarajVijay ThalapathyViral
Comments (0)
Add Comment