Director Karthik Shocking :రెట్రో క‌థ ర‌జ‌నీకాంత్ కోసం రాశా

ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ కామెంట్స్

Karthik : న‌టీ న‌టులు జ్యోతిక‌, సూర్య నిర్మించిన చిత్రం రెట్రో(Retro). దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు టాప్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్. సినిమాను ఓ రేంజ్ లో టెక్నిక‌ల్ , హ్యూమ‌న్ వాల్యూస్ కు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తూ తీయ‌డంలో త‌న‌కు త‌నే సాటి. అందుకే త‌న నుంచి మూవీ వ‌స్తుందంటే చాలు అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూడ‌టం అల‌వాటు. తాజాగా సూప‌ర్ హీరో సూర్య‌, బాలీవుడ్ బ్యూటీ అందాల బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కీల‌క పాత్రలు పోషిస్తున్నీ ఈ చిత్రం ఇప్ప‌టికే రికార్డు బ్రేక్ చేస్తోంది. మార్కెట్ ప‌రంగా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. దీనికి కార‌ణం ద‌ర్శ‌కుడి ప్ర‌తిభా నైపుణ్యం మాత్ర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Karthik Subbaraju Shocking Comments

రెట్రో చిత్రం పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ మేర‌కు మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మే1న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ద‌మైంది. దీంతో మూవీ ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్, న‌టీ న‌టులు సూర్య‌, పూజా హెగ్డే. కొంత గ్యాప్ త‌ర్వాత పూజా త‌మిళంలో న‌టించ‌డం. త‌ను కీల‌క వ్యాఖ్య‌లు చేసింది ద‌ర్శ‌కుడిపై. ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ లో కార్తీక్ సుబ్బ‌రాజ్(Karthik Subbaraju) త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట పెట్టాడు. ముందుగా రెట్రో సినిమా కోసం క‌థ త‌యారు చేసుకున్నాన‌ని, ఇది కేవ‌లం త‌మిళ సూప‌ర్ స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్ ని దృష్టి లో పెట్టుకుని రాశాన‌ని చెప్పాడు.

అంతే కాకుండా త‌న జీవితంలో ఎప్పుడో ఒక‌సారి ద‌ళ‌ప‌తి విజ‌య్ తో సినిమా చేయాల‌ని ఉంద‌న్నాడు. అది కూడా జ‌న నాయ‌గ‌న్ చివ‌రి చిత్రం చేయాల్సి ఉండేద‌న్నాడు. ఎన్నో క‌థ‌లు విజ‌య్ కి వినిపించాన‌ని, కానీ ఎందుక‌నో ఏ క‌థ‌ను ఆయ‌న ఓకే చేయ‌లేక పోయాడ‌ని వాపోయాడు. ఇదే స‌మ‌యంలో తాజాగా రెట్రో ర‌జ‌నీకాంత్ కు వినిపించాన‌ని, కానీ త‌ను ఇత‌ర సినిమాల‌లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల కుద‌ర‌లేద‌న్నాడు. చివ‌ర‌కు సూర్య‌తో చేయాల్సి వ‌చ్చింద‌న్నాడు కార్తీక్ సుబ్బ‌రాజ్.

Also Read : Beauty Imanvi Responds :నేను పాకిస్తానీ కాదు ఇండియ‌న్ అమెరిక‌న్

CinemaCommentskarthik subbarajRetroUpdatesViral
Comments (0)
Add Comment