Karthikeya Praise : అజిత్ ప్ర‌చారం కోరుకోడు

న‌టుడు కార్తికేయ ప్రశంస

Karthikeya Praise : త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో ఒక్కో న‌టుడిది ఒక్కో ప్ర‌త్యేక‌త‌. ర‌జ‌నీకాంత్ , ఇళ‌య త‌ల‌ప‌తి విజ‌య్ , అజిత్ కుమార్ ఎవ‌రికి వారే ప్ర‌త్యేకం. అజిత్ కుమార్ గురించి టాలీవుడ్ న‌టుడు కార్తికేయ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కొంద‌రు త‌మ సినిమాల గురించి ఎక్కువ‌గా ప్ర‌మోట్ చేసుకునేందుకు ఇష్ట ప‌డ‌తారు. కానీ అజిత్ కుమార్ అలా కాదు. ఆయ‌న ఎక్కువ‌గా ప‌బ్లిక్ ఫంక్ష‌న్ ల‌లో క‌నిపించ‌రు. ఇత‌ర న‌టీ న‌టుల‌తో పోలిస్తే ఆయ‌న భారీ ఓపెనింగ్ కు ప్ర‌ధాన కార‌ణం ఇదేన‌ని నేను అనుకుంటున్నాన‌ని పేర్కొన్నారు.

Karthikeya Praise Ajit Kumar

ఎకే లాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అందుకే ఆయ‌న బాటలోనే నేను న‌డ‌వాల‌ని అనుకుంటున్నా. ఎందుకంటే మ‌నం చేసే సినిమాలో ద‌మ్ముంటే ఆ చిత్రం అదంత‌కు అదే ఆడ‌తుంద‌ని అన్నాడు.

ప్ర‌చారం చేసుకోవ‌డం కంటే ఆ స‌మ‌యాన్ని సినిమా బాగా వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేస్తే బెట‌ర్ అని సూచించాడు యాక్ట‌ర్ కార్తికేయ‌(Karthikeya). తాను కూడా ప‌బ్లిసిటీకి, ప్ర‌చారాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించు కున్నాన‌ని తెలిపాడు.

ఇదిలా ఉండ‌గా అజిత్ కుమార్ , కార్తికేయ‌, హుమా ఖురేషీ, గుర్బానీ క‌లిసి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వాలిమైలో న‌టించారు. ప్ర‌స్తుతం ఇది అందుబాటులో ఉంది. ఇదిలా ఉండ‌గా కార్తికేయ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Also Read : Salaar Bookings : స‌లార్ అమెరికాలో రికార్డ్

karthikeya ajit kumar valimai movie
Comments (0)
Add Comment