Katrina Kaif : నిన్న ర‌ష్మిక నేడు క‌త్రీనా 

ఫేక్ ఫోటోలు..వీడియోలు వైర‌ల్ 

Katrina Kaif : టెక్నాల‌జీ శ‌ర‌వేగంగా మారుతోంది. రోజు రోజుకు ఫేక్ వీడియోలు, ఫోటోలు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. ఈ మ‌ధ్య‌న ఏఐ టెక్నాల‌జీతో మార్ఫింగ్  చేయ‌డం ప‌రిపాటిగా మారింది. తాజాగా సినీ రంగానికి చెందిన పేరు పొందిన న‌టీమ‌ణులు టార్గెట్ కు గుర‌వుతున్నారు.

Katrina Kaif Viral

ప్ర‌త్యేకించి ఇటీవ‌ల నేష‌న‌ల్ క్ర‌ష్ గా గుర్తింపు పొందిన   శాండిల్ వుడ్ కు చెందిన ర‌ష్మిక మంద‌న్నాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ కు గుర‌య్యారు. దీంతో పెద్ద ఎత్తున  సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కు గుర‌య్యారు. తీవ్ర ఆవేద‌నకు గురైన ర‌ష్మిక మంద‌న్నా ఆ వెంట‌నే పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు.

దీనిపై పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది. ఈ మేర‌కు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ సీరియ‌స్ అయ్యారు. ఇలాంటి చ‌వ‌క‌బారు ప‌నులు చేయొద్ద‌ని, చేసిన వారిని, వ్య‌క్తిగ‌తంగా ఇబ్బందుల‌కు గురి చేసే వారిని వెంట‌నే గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ర‌ష్మిక మంద‌న్నాకు మ‌ద్ద‌తు తెలిపారు. ఇద్ద‌రూ క‌లిసి ఇటీవ‌ల ఓ చిత్రంలో న‌టించారు.

ఇదిలా ఉండ‌గా నిన్న ర‌ష్మిక మంద‌న్నా కంప్లైట్ చేసిన వార్త క‌ల‌క‌లం రేపితే తాజాగా మరో బాలీవుడ్ న‌టి క‌త్రీనా కైఫ్(Katrina Kaif) ఫేక్ ఫోటోస్, వీడియోస్ కు గుర‌య్యారు. త‌ను టైగ‌ర్ 3 మూవీలో స‌ల్మాన్ ఖాన్ తో న‌టిస్తోంది. ఈ చిత్రంలో ట‌వల్ తో ఫైటింగ్ చేస్తున్న సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. కానీ వీటికి సంబంధించి  డిఫ‌రెంట్ సీన్స్ బ‌య‌ట‌కు రావ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : Thug Life Kamal : మ‌ణి ర‌త్నం మ్యాజిక్ షురూ

Comments (0)
Add Comment