Keerthy Suresh Jayam Ravi : కీర్తి..జ‌యం ర‌వి స‌రైన్ స్టార్ట్

మ‌రో పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

Keerthy Suresh Jayam Ravi : ఆంథోనీ భాగ్య‌రాజ్ తొలిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం సైర‌న్. ఇందుకు సంబంధించి పూజా కార్య‌క్ర‌మం పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో జ‌యం ర‌వితో పాటు అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్(Keerthy Suresh) తో పాటు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్నారు.

Keerthy Suresh Jayam Ravi New Movie

ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది కీర్తి సురేష్. ఆమె గ‌తంలో 2022లో సాని కాయిదం మూవీలో న‌టించింది. ఇది రెండో చిత్రం కావ‌డం విశేషం. సైర‌న్ ను ఆంథోనీ భాగ్య‌రాజ్ భావోద్వేగంతో కూడే యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

చిత్ర టీం ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్లే ముందు 15 రోజుల లోపు సినిమాకు సంబంధించి షూటింగ్ షెడ్యూల్ చెనైలో జ‌ర‌గ‌నుంది. స‌రైన్ లో ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని, క‌మెడియ‌న్ యోగి బాబు కూడా ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

ఈ మూవీకి జీవీ ప్ర‌కాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. మాన‌గ‌రం ఫేమ్ సెల్వ కుమార్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ఎడిటింగ్ రూబెన్ , స్టంట్స్ దిలీప్ సుబ్బ‌రాయ‌న్ చేస్తున్నారు. హోమ్ మూవీ మేక‌ర్స్ జ‌యం ప‌తాకంపై సుజాత విజ‌య్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Also Read : Naveen Polishetty : మూవీ స‌క్సెస్ పోలిశెట్టి ఖుష్

Comments (0)
Add Comment