Keerthy Suresh: డైహార్ట్‌ ఫ్యాన్‌ కు సారీ చెప్పిన మహానటి !

డైహార్ట్‌ ఫ్యాన్‌ కు సారీ చెప్పిన మహానటి !

Keerthy Suresh: అభిమానులు లేనిదే ఏ స్టార్ లేరులే అనే నగ్న సత్యాన్ని గ్రహించిన దాదాపు అందరూ హీరో,హీరోయిన్లు కూడా సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు సైతం…. తన సినిమా ఫంక్షన్స్ లో అభిమానులను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. దీనికి తన అభిమాన హీరో సినిమా కోసం థియేటర్ దగ్గర బ్యానర్ కట్టడం నుండి పుట్టిన రోజుల నాడు రక్తదానం చేయడం వరకు అభిమానులు వారిపై చూపే ప్రేమే కారణం. మరికొందరు అయితే మరో అడుగు ముందుకేసి తన అభిమాన హీరో లేదా హీరోయిన్ల కోసం గుళ్ళు, గోపురాలు కట్టడం, సిరాతో కాకుండా తమ రక్తంతో అభిమాన హీరో లేదా హీరోయిన్లకు లేఖలు రాయడం చూస్తున్నాం.

Keerthy Suresh Comment

ఇలాంటి వీరాభిమానులను సంపాదించిన హీరోయిన్లలో కుష్బుూ, జ్యోతిక ఉన్నారు. ఈ నేపథ్యంలో బాల నటిగా జీవితాన్ని ప్రారంభించి… హీరోయిన్ గా మారిన అతి తక్కువ సమయంలోనే జాతీయ ఉత్తమ నటిగా మారిన కీర్తీ సురేష్(Keerthy Suresh) కూడా విశేషంగా అభిమానులను సంపాదించుకున్నారు. మహానటి, దసరా వంటి సినిమాలతో తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ తన కంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్, సమంత, ఎమిజాక్సన్ ప్రధాన పాత్రల్లో తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘తెరి’ హిందీ రీమేక్ లో సమంత పాత్రను పోషిస్తున్నారు. మరోవైపు సైరన్‌, రఘుతాత, రివాల్వర్‌ రీటా, కన్నివెడి సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో కీర్తీ సురేష్(Keerthy Suresh)… తన వీరాభిమానికి క్షమాపణ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కీర్తీ సురేష్ కు వీరాభిమానిగా చెప్పుకునే కృష్ణ అనే వ్యక్తి… ఆమెకు వరుసగా 233 లెటర్స్ రాసి ఆమెకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే ఆమె అతని లెటర్స్ కు ఎప్పుడూ స్పందించలేదు. అయినప్పటికీ అతను లెటర్స్ రాయడం మాత్రం ఆపలేదు.

అయితే అతను రాసిన 234వ లెటర్ కు కీర్తీ సురేష్‌ స్పందించారు. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా అతని 234వ లెటర్ కు స్పందిస్తూ… 234 తనకు ఫాంటసీ నంబర్‌ అని ఆ ట్వీట్ లో పేర్కొంది. అంతేకాదు ఆలస్యంగా స్పందించినందుకు క్షమించు లాట్సాప్‌ లవ్‌ అంటూ కామెంట్ చేసింది. దీనితో కీర్తీ సురేష్ చేసిన ట్వీట్‌… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీరాభిమాని లెటర్ కు స్పందించడం, క్షమాపణ చెప్పడంతో పాటు తన ఫాంటసీ నెంబర్ ను రివీల్ చేయడంపై కీర్తీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం త్వరలో గ్రాండ్ ఈవెంట్ ! 

Keerthy Suresh
Comments (0)
Add Comment