Kesari 2 : చెరిపేస్తే చెరిగి పోయేది కాదు చరిత్ర. ఈ దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చేందుకు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తూ వచ్చింది. వేలాది మంది బలిదానాలు, ప్రాణత్యాగాలు చేసినందువల్లనే బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి లభించింది. అలాంటి దేశ చరిత్రలో చీకటి రోజులు ఎన్నో ఉన్నాయి. వాటిలో జలియన్ వాలా బాగ్ ఊచకోత ఉదంతం. ఈ ఘటనకు సంబంధించి న్యాయం కోసం ఓ వ్యక్తి చేసిన పోరాటం ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచి పోతుంది. అతను ఎవరో కాదు సి. శంకరన్ నాయర్. ఆయనను ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే కేసరి చాప్టర్ -2(Kesari 2) చిత్రం.
Kesari 2 Movie Updates
ఇందులో కీలక పాత్ర పోషించాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు రూ. 50 కోట్లు వసూలు సాధించింది. రూ. 100 కోట్ల క్లబ్ లోకి దూసుకు పోతోంది. 8వ రోజు రూ. 4.15 కోట్లు సంపాదించింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 50.25 కోట్ల మార్క్ ను దాటేసింది. హిందీ ఆక్యుపెన్సీ 14.9 శాతంగా ఉంది. ఉదయం షోలు 6.39 శాతం ఉండగా మధ్యాహ్నం షోలు 12.39 శాతం, సాయంత్రం షోస్ 13.65 శాతం, రాత్రి షోలు 27.16 శాతంగా ఉన్నాయి.
సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు దేశీయ కలెక్షన్స్ హాఫ్ సెంచరీని దాటేశాయి. సినీ విమర్శకుడు, విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కీలక వ్యాఖ్యలు చేశాడు కేసరి చాప్టర్ 2 చిత్రం. ఇక అంతర్జాతీయ పరంగా కూడా మంచి టాక్ వచ్చిందని తెలిపాడు. అమెరికా, ఆస్ట్రేలియాలలో గణనీయమైన వృద్దిని సాధించిందన్నాడు. అక్షయ్ కుమార్ గతంలో నటించిన మూవీస్ కంటే కేసరి చాప్టర్ 2 సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోతోందంటూ పేర్కొన్నాడు. మొత్తంగా అక్షయ్ కి ఫీల్ గుడ్ ను కలిగించిందని చెప్పక తప్పదు.
Also Read : Hero Rajkummar Rao Praises :నేచురల్ స్టార్ కు రాజ్ కుమార్ రావు ప్రశంస