Vishwambhara Movie : చిరు బర్త్ డే స్పెషల్ గా ‘విశ్వంభర’ సినిమా నుంచి కీలక అప్డేట్

దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు...

Vishwambhara : చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. శుక్రవారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్‌ ట్రీట్‌ ఇచ్చింది. చిరు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆయన త్రిశూలం చేత పట్టుకుని కన్పించారు. ‘‘ చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు, ఒక అద్భుతమైన తార పోరాడటానికి ప్రకాశిస్తుంది’’ అని నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ ట్వీట్‌లో పేర్కొంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Vishwambhara Movie Updates

దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. గతంలో చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపించనున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కథానాయికగా కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read : Allu Arjun : ఏదైనా నాకు నచ్చితే చేస్తాను..ఇష్టమైతేనే వెళ్తాను

ChiranjeeviCinemaTrendingUpdatesViralVishwambhara
Comments (0)
Add Comment