Hero Vijay Deverakonda-Kingdom :హృద‌యం లోప‌ల గుండెలు గిల గిల

విజ‌య్ దేవ‌ర‌కొండ..భాగ్య‌శ్రీ బోర్సే కీ రోల్స్

Kingdom : త‌క్కువ వ్య‌వ‌ధిలోనే త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న యువ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాను న‌టించిన లైగ‌ర్ , ఖుషి ఆశించిన మేర ఆడ‌క పోయినా సినిమాల‌లో ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి. తాజాగా త‌ను కింగ్ డ‌మ్ లో న‌టిస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి కావ‌స్తోంది. ఇటీవ‌లే మూవీ మేక‌ర్స్ కీల‌క స‌న్నివేశాలు శ్రీ‌లంక‌లోని కొన్ని ప్రాంతాల‌లో చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్బంగా కింగ్ డ‌మ్ టీజ‌ర్ విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప చేసేలా చేసింది. మంచి ఆద‌ర‌ణ చూర‌గొంది కూడా. త్వ‌ర‌లోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు ద‌ర్శ‌కుడు.

Kingdom Movie Sensational Update

ఇదే సమ‌యంలో తాజాగా కింగ్ డ‌మ్(Kingdom) మూవీ నుంచి ఫీల్ గుడ్ ఉన్న పాట ప్రోమోను రిలీజ్ చేశారు. హృద‌యం లోప‌లా గుండె గిల గిల అంటూ మ‌రింత ఆక‌ట్టుకునేలా ఉంది. చిత్రీక‌ర‌ణ సూప‌ర్ గా ఉంది.
మనుగడ కోసం ప్రేమను నకిలీ చేస్తారు, కానీ త్వరలోనే అది చాలా నిజమనిపించ‌డం ఖాయ‌మ‌ని ఇందులో రాశారు గేయ ర‌చ‌యిత‌. ఇప్ప‌టికే లూప్ లో ప్లే అవుతోంది. బిగ్ హిట్ గా పేరు పొందింది. ఇదిలా ఉండ‌గా కింగ్ డ‌మ్ ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీస్తున్నాడు గౌత‌మ్ తిన్న‌సూరి. త‌మిళ సినీ రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించాడు.

విజువ‌ల్స్ గ్రాండ్ గా, అద్భుతంగా మ‌న‌సు దోచుకునేలా ఉన్నాయి. జోమాన్ టి జాన్ , గిరీష్ గంగాధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. న‌వీన్ నూలి ఎడిటింగ్ సూప‌ర్ చేశాడు. ఇవాళ పూర్తి పాట‌ను రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. మ‌నోహ‌ర‌మైన‌, గుండెల‌ను త‌ట్టి లేపేలా ఉన్న ఈ సాంగ్ ను కేకే మ‌న‌సు పెట్టి రాశారు. దార్ గై కొరియోగ్ర‌ఫీ అందించారు. ద‌ర్శ‌కుడే క‌థ రాసి అద్భుతంగా తెర‌కెక్కించడంలో స‌క్సెస్ అయ్యాడు.

Also Read : Dethadi Movie Sensational :చారిత్రాక‌ నేప‌థ్యం దేత్త‌డి చిత్రం 

CinemaKingdomUpdatesViral
Comments (0)
Add Comment