Hero Kiran Abbavaram-Ka : దాదా సాహెబ్ పుర‌స్కారం క ఉత్త‌మ చిత్రం

కీల‌క పాత్ర పోషించిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం

Kiran Abbavaram : కిర‌ణ్ అబ్బ‌వ‌రం కీల‌క పాత్ర పోషించిన చిత్రం క‌. రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లువురి ప్ర‌శంస‌లు పొందింది. అంతే కాదు భార‌త దేశ సినీ రంగంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు నామినేట్ అయ్యింది ఈ మూవీ. ఉత్త‌మ చిత్రం కేట‌గిరీలో క బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఇది 15వ ఫిల్మ్ ఉత్స‌వం కావ‌డం విశేషం. ఈ సినిమాకు సంబంధించి సినీ విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఆకాశానికి ఎత్తేశారు.  చిత్రాన్ని చింతా గోపాల‌కృష్ణా రెడ్డి నిర్మించాడు. నూత‌న ద‌ర్శ‌కులు సందీప్, సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Kiran Abbavaram- Ka Movie got Award

2024లో విడుద‌లైంది. సూప‌ర్ స‌క్సెస్ గా నిలిచింది. ఇందులో కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో పాటు న‌య‌న్ సారిక‌, త‌న్వీరామ్ కీ రోల్స్ పోషించారు. దీనిని పూర్తిగా క‌ర్మ సిద్దాంతం ఆధారంగా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ గా రూపొందించారు ద‌ర్శ‌కులు. క‌మ‌ర్షియ‌ల్ ప‌రంగా కాసులు కురిపించేలా చేసింది. టేకింగ్, మేకింగ్ లో వెరీ డిఫ‌రెంట్ గా తీశారు. ప్ర‌త్యేకించి సినిమా రంగంలోకి రావాల‌ని అనుకున్న వాళ్ల‌కు ఓ పాఠంగా నిలిచి పోతుంద‌ని పేర్కొన్నారు రివ్యూ చేసిన వారంతా.

ఈ సంద‌ర్బంగా మూవీ మేక‌ర్స్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము కంటెంట్ ను న‌మ్ముకున్నామ‌ని, న‌టీ న‌టులు త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల‌కు న్యాయం చేశార‌ని అందుకే స‌క్సెస్ అయ్యింద‌ని, అత్యున్న‌త‌మైన అవార్డును స్వంతం చేసుకుంద‌న్నారు. మ‌రో వైపు హీరోగా న‌టించిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం అయితే అంతులేని ఆనందానికి లోన‌య్యాడు. త‌న సినీ కెరీర్ లో క చిత్రం మ‌రిచి పోలేని జ్ఞాప‌కాల‌ను మిగిల్చింద‌న్నాడు.

Also Read : Hero Prabhas-Deepika :వంగా మూవీలో ప్ర‌భాస్..దీపికా ప‌దుకొనే

AwardsDadasaheb PhalkeKa MovieKiran AbbavaramUpdatesViral
Comments (0)
Add Comment