Hero Kiran Abbavaram : కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘క’ చిత్రం అరుదైన గౌర‌వం 

దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు నామినేట్ 

Kiran Abbavaram : గ‌త ఏడాది 2024లో దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది కిర‌ణ్ అబ్బ‌వ‌రం ముఖ్య పాత్ర పోషించిన క చిత్రం. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పెద్ద ఎత్తున క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టింది. ఏకంగా రూ. 50 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. త‌న సినీ కెరీర్ లో అతి పెద్ద బిగ్ హిట్ మూవీగా నిలిచింది. తాజాగా త‌ను న‌టించిన క సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు నామినేట్ అయ్యింది. ఈ చిత్రానికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ సంద‌ర్బంగా సంతోషానికి లోన‌య్యారు కిర‌ణ్ అబ్బ‌వ‌రం(Kiran Abbavaram).

Kiran Abbavaram ‘Ka’ Movie

త‌క్కువ బ‌డ్జెట్ తో క మూవీని తెర కెక్కించారు ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉండ‌గా ఉత్త‌మ సినిమా కేట‌గిరీలో ఈ చిత్రం నామినేట్ అయిన‌ట్లు అధికారికంగా మూవీ టీం వెల్ల‌డించింది. ఈనెల చివ‌ర‌లో ఢిల్లీ వేదిక‌గా వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలిపింది. విజేత‌ల‌కు పుర‌స్కారాల‌ను అంద‌జేయ‌నున్నారు నిర్వాహ‌కులు. మ‌రో వైపు పూర్తి సందేశాత్మ‌కంగా తీసిన క మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దీనిని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్  చేజిక్కించుకుంది.

సినిమాను థియేట‌ర్ల‌లో చూడ‌లేని వారి కోసం ఓటీటీలో సిద్దంగా ఉంది. సినీ ఫ్యాన్స్ స్ట్రీమింగ్ లో సిద్దంగా ఉన్న క సినిమాను చూడ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది స‌ద‌రు సంస్థ‌. డాల్బీ విజ‌న్, డాల్బీ అట్మాస్ ద్వారా మూవీని తీసుకు రావ‌డం జ‌రిగింద‌ని ఈటీవీ విన్ వెల్ల‌డించింది. మ‌రో వైపు క చిత్రం ఘ‌న విజ‌యాన్ని సాధించ‌డంతో క‌కు సంబంధించి సీక్వెల్ తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది మూవీ బృందం. తొలి పార్ట్ కంటే రెండో పార్ట్ ను మ‌రింత ఉత్కంఠ భ‌రితంగా తీసుకు వ‌స్తామ‌ని హామీ ఇచ్చింది.

Also Read : Odela 2 Shocking :ఓదెల 2కు షాక్..స‌న్నివేశాలు తొల‌గించండి

CinemaKAKiran AbbavaramTrendingUpdates
Comments (0)
Add Comment