హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్రం ఎప్పుడూ రాష్ట్రాలతో సత్ సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. తమపై లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అభివృద్దిపై చర్చకు రావాలని అన్నారు. నిత్యం దేశం కోసం ఆలోచించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లేనిపోని కామెంట్స్ చేస్తే బాగుండదని హెచ్చరించారు.
దేనికైనా , ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు గంగాపురం కిషన్ రెడ్డి. మీతో పాటు మీ మంత్రులు సైతం ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. ఇది మీ అవగాహన రాహిత్యాన్ని సూచిస్తోందన్నారు . భారతీయ జనతా పార్టీ చీఫ్ ను తమ పార్టీ హై కమాండ్ నిర్ణయించిందన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పూర్తిగా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులుగా సునీల్ బన్సల్, శోభా కర్లందాజ్లే వ్యవహరిస్తారని వెల్లడించారు. ఎన్. రామచందర్ రావును పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని డెసిషన్ తీసుకుందని, ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.