KTR Rashmika : ర‌ష్మికకు కేటీఆర్ మద్ధ‌తు

డీప్ ఫేక్ వివాదంపై ఆగ్ర‌హం

KTR Rashmika : హైద‌రాబాద్ – ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్(KTR Rashmika) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా టెక్నాల‌జీ సాయంతో పేరు పొందిన సినీ న‌టీమ‌ణుల‌పై మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీటిపై సీరియ‌స్ గా స్పందించింది కేంద్రం.

KTR Rashmika side Responded

అదే స‌మ‌యంలో ర‌ష్మిక మంద‌న్నా తో పాటు మ‌రో బాలీవుడ్ న‌టి క‌త్రీనా కైఫ్ సైతం డీప్ ఫేక్ బారిన ప‌డ్డారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ సైతం స్పందించారు. ఈ మేర‌కు విచార‌ణ‌కు ఆదేశించామ‌ని, త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

న‌టీమ‌ణుల ఫేక్ ఫోటోలు, మార్ఫింగ్ ల‌పై అగ్ర న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ , ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద సైతం స్పందించారు. వెంట‌నే విచార‌ణ జ‌రిపించాల‌ని, దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరారు. టెక్నాల‌జీ సాయంతో ఇలాంటి చెత్త ప‌నులు ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా ఓ జాతీయ ఛాన‌ల్ తో మాట్లాడిన కేటీఆర్ పై స‌మ‌స్య‌పై స్పందించారు. ఈ మేర‌కు ర‌ష్మిక మందాన‌, క‌త్రీనా కైఫ్ ల‌కు త‌న సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో క‌ఠిన‌మైన చ‌ట్టాలు తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read : Indian-2: సేనాపతి 2.o గా కమల్ హాసన్

Comments (0)
Add Comment