Hero Dhanush-Kubera Song :జాకే ఆనా యారా సాంగ్ సూప‌ర్

కుబేర మూవీ నుంచి తాజా రిలీజ్

Kubera  : కుబేరా మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. తాజాగా హిందీలో జాకే ఆనా యారా సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇందులో త‌మిళ సూప‌ర్ స్టార్ ధ‌నుష్ కీ రోల్ పోషించాడు. ఈ చిత్రం సామాజిక నాట‌క నేప‌థ్యంలో తీశాడు ద‌ర్శ‌కుడు. దీనిని త‌మిళం, తెలుగు రెండింటిలోనూ చిత్రీక‌రించారు. ఇందులో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంగా విడుద‌ల కానుంది.

Kubera Jaake Aana Yara Song Viral

ధ‌నుష్ తో పాటు అక్కినేని నాగార్జున న‌టించారు కుబేరా(Kubera) సాంగ్ లో. జాకే ఆనా యారా పేరుతో తొలి సింగిల్ విడుద‌లైంది. అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. తెలుగులో పోయి రారా మామా, త‌మిళంలో పోయిరానంబా, హిందీలో జాకే ఆనా యారా పేర్ల‌తో విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్.

రిలీజ్ అయిన సింగిల్ ను హిందీ వెర్ష‌న్ ను న‌కాష్ అజీజ్ పాడారు. ర‌కీబ్ ఆలం పాట‌ను రాశారు. ఇక త‌మిళం, తెలుగు వెర్ష‌న్ ల‌కు ధ‌నుష్ త‌న గాత్రాన్ని అందించ‌డం విశేషం. ఇక సినిమాకు సంబంధించి నాగార్జున అక్కినేని ఫ‌స్ట్ లుక్ గ‌త ఏడాది మేలో ఆవిష్క‌రించారు. ఈ వీడియోలో నాగ్ గొడుగు కింద న‌డుస్తున్న దృశ్యం క‌నిపించింది. కుబేర‌ను వ‌చ్చే జూన్ నెల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Also Read : Hero Mohan Lal-Messi :మెస్సీ బ‌హుమానం మోహ‌న్ లాల్ సంతోషం

CinemaKuberaNew SongsUpdatesViral
Comments (0)
Add Comment