Kunal Kapoor: బాలీవుడ్‌ ‘రామాయణ’లోకి మరో నటుడు !

బాలీవుడ్‌ ‘రామాయణ’లోకి మరో నటుడు !

Kunal Kapoor: అల్లు అరవింద్ నిర్మాతగా బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు నితేశ్‌ తివారీ త్వరలో తెరకెక్కించబోయే భారతీయ ఇతిహాసం ‘రామాయణం’. రెండు భాగాలుగా నిర్మాణం చేపట్టబోయే ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, రావణుడిగా యశ్‌, విభీషణుడిగా విజయ్‌ సేతుపతి, హనుమంతుడిగా బాబీ డియోల్, సీత పాత్రలో సాయిపల్లవిను, శూర్పణఖగా రకుల్ ప్రీత్, కైకేయిగా లారాదత్తా ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తన వాయిస్ మాడ్యులేషన్ కోసం రణ్ బీర్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌… ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

Kunal Kapoor Movie Updates

బాలీవుడ్‌ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘రామాయణ’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వార్తలు సోషల్‌ మీడియాలో ఎన్నోసార్లు వైరల్‌ కాగా.. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరో నటుడు భాగం కానున్నారనే వార్త తెగ షేర్‌ అవుతోంది. బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌(Kunal Kapoor) ‘రామాయణ’లో కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయనకు స్క్రీన్‌ టెస్ట్‌ కూడా నిర్వహించినట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన పాత్ర కోసం రిహార్సిల్స్‌ చేస్తున్నారని టాక్‌. అయితే, ఈ పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచాలని భావిస్తోందట. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రానున్న ‘విశ్వంభర’లోనూ కునాల్(Kunal Kapoor) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

‘రామాయణ’ సినిమా విషయానికొస్తే.. చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని మేకర్స్ భావిస్తున్నారు. 2025 డిసెంబర్‌ నాటికి షూటింగ్‌ పూర్తి చేయాలనుకుంటున్నారు. దీని కోసం పన్నెండు భారీ సెట్లను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయోధ్య, మిథిలా నగరాలను తలపించేలా వాటిని తీర్చి దిద్దుతోందట మూవీ యూనిట్‌. 3డీ ఫార్మాట్‌లో, భారీ వ్యయంతో ముంబయిలో వీటిని రూపొందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే దీని షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రీకరణకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో ఇటీవల సందడి చేశాయి. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : Lavanya: రాజ్‌ తరుణ్‌ స్నేహితుడిని చెప్పుతో కొట్టిన లావణ్య !

Kunal KapoorNitesh TiwariRamayanranbir kapoor
Comments (0)
Add Comment