Ramesh Reddy Interesting Award :ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ గా ర‌మేష్ రెడ్డి

15వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివ‌ల్

Ramesh Reddy : కుశేంద్ర ర‌మేష్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. 15వ దాదా సాహెబ్ పాల్కే ఫెస్టివ‌ల్ లో ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ గా ఎంపిక‌య్యాడు. ఈ సంద‌ర్భంగా పుర‌స్కారాన్ని అందుకున్నాడు. త‌ను ర‌జాక‌ర్, బార్బారిక్ చిత్రాల‌కు ప‌ని చేశాడు. తెలంగాణ చ‌రిత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కింది ర‌జాక‌ర్. ఆనాటి ర‌జాకార్ల దాష్టీకాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించే ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్. ఇక ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను క‌దిలించేలా, కంట త‌డి పెట్టించేలా చేసింది ఈ మూవీ. ప్రాణ ప్ర‌దంగా త‌యారు కావ‌డంలో కీల‌క భూమిక పోషించాడు ర‌మేష్ రెడ్డి.

Kushendra Ramesh Reddy Got Dada Saheb Phalke Award

ప్ర‌స్తుతం త్రిబ‌నాధ‌రి బార్బారిక్ మూవీకి డీఓపీగా ప‌ని చేస్తున్నాడు ర‌మేష్ రెడ్డి(Ramesh Reddy). ఈ సంద‌ర్బంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ద‌క్క‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశాడు. శక్తివంతమైన కథకు గొప్ప లోతును జోడించేలా చేశాయి. ఇదిలా ఉండ‌గా రమేష్ రెడ్డి తన కెరీర్‌ను చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా ప్రారంభించాడు.

త‌ను ప్ర‌ముఖ సినిమాల‌కు ప‌ని చేశాడు. అందులో ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నాని న‌టించిన ఈగ‌, ప్ర‌భాస్, అనుష్క శెట్టి కీ రోల్స్ పోష‌ఙంచిన బాహుబలి 1, బాహుబలి 2, రామ్ చ‌ర‌ణ్ , జూనియ‌ర్ ఎన్టీఆర్ , ఆలియా భ‌ట్ ఆర్ఆర్ఆర్ చిత్రాల‌కు ప‌ని చేశాడు ర‌మేష్ రెడ్డి. ఇండియ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్ ల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు. జాతీయ స్థాయిలో పుర‌స్కారం అందుకున్నాడు.

ర‌జాక‌ర్ చిత్రానికి యాత స‌త్య నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని భారతదేశంతో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన ముఖ్యమైన పాత్రను ఈ మూవీ తెలియ చేస్తుంది. ఈ అద్భుత క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌దైన పాత్ర పోషించాడు ర‌మేష్ రెడ్డి. త‌న ప‌నిత‌నానికి విమ‌ర్శ‌కులు సైతం ఫిదా అయ్యారు.

Also Read : Beauty Nayanthara-Chiranjeevi :మెగా అనిల్ రావిపూడి మూవీలో న‌య‌న్

AwardsUpdatesViral
Comments (0)
Add Comment