Lakshmi Manchu: సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సెలబ్రెటీ స్టాటస్ ను ఎంజాయ్ చేస్తున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న. మోహన్ బాబు వారసురాలిగా అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరెంద్రీ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీ ప్రసన్న… ఆ సినిమాలో మంచు లక్ష్మి నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే మంచు లక్ష్మీ హీరోయిన్ గా రాణించలేకపోయినప్పటికీ… వ్యాఖ్యాతగా ముఖ్యంగా ఇంగ్లీషును ఒక రకమైన యాసతో మాట్లాడటంలో మంచి గుర్తింపు పొందింది. చివరిగా ఆమె మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మాన్ స్టర్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Lakshmi Manchu….
ప్రస్తుతం సినిమాలకు కాస్తా దూరంగా ఉన్నప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. మంచు లక్ష్మి(Lakshmi Manchu) ఫిట్ నెస్ తో కూడా ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. అయితే మంచు లక్ష్మి ఒక్కసారిగా తన సోషల్ మీడియాలో విధ్వంసాన్ని రాజేసింది. రీసెంట్ గా అమ్మడు బీచ్ ఒడ్డున స్టోన్స్ దగ్గర అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. వాతావరణానికి తగ్గట్టుగా అమ్మడు తన అందంతో మెస్మరైజ్ చేసింది. ఆ లుక్స్ కు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. నాలుగు పదుల వయసులో కూడా ఆమె తన ఫిట్నెస్ తో అందంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గ్లామరస్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఫొటో షూట్స్ లో కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్లే కుళ్లుకునేలా గ్లామర్ ప్రదర్శనతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తున్న మంచు లక్ష్మి అందం మరింత రెట్టింపు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నారు అంటూ ప్రసంసిస్తున్నారు. ఇక ఈ స్టిల్స్ లలో మంచు లక్ష్మి నడుము అందాలని చూపిస్తూనే మరో వైపు ఎద అందాలని కూడా ఆరబోసింది. ఇంత అందంగా ఉంటే హీరోయిన్స్ ఎవరూ ఇక పోటీ ఇవ్వలేరని నెటిజన్లు మరొక విధంగా కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఇండస్ట్రీలో ఏ విధంగా మెరుస్తుందో చూడాలి.
Also Read : Mohanlal: నాలుగేళ్ల తర్వాత సెట్స్ పైకి మోహన్ లాల్ ‘రామ్’ !