Lakshmika Sajeevan: గుండెపోటుతో యంగ్ హీరోయిన్ మృతి

గుండెపోటుతో యంగ్ హీరోయిన్ మృతి

Lakshmika Sajeevan : మాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటి లక్ష్మీకా సజీవన్… 24 ఏళ్లకే గుండెపోటులో ఆకస్మికంగా కన్నుమూశారు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న ఆమె షార్జాలోని గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. లక్ష్మిక సజీవన్ తన కెరీర్‌లో పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్ లతో పాటు దుల్కర్ సల్మాన్ సరసన ‘ఒరు యమందన్ ప్రేమకథా’ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది. అట్టడుగు వర్గాల పోరాటాలను వెలుగులోకి తెచ్చిన టెలిఫిల్మ్ ‘కాక్క’లో లక్ష్మికా పాత్ర‌కు గుర్తింపు పొందింది. లక్ష్మికా మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

Lakshmika Sajeevan – హృదయాన్ని కదిలిస్తున్న లక్ష్మిక చివరి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే లక్ష్మీకా సజీవన్(Lakshmika Sajeevan)… చివరి సారిగా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్టు అభిమానుల హృదయాలను కదిలిస్తోంది. ఎత్తైన నిర్మాణాలు ప్రకృతి అందాలతో నిర్మలమైన సూర్యోదయ నేపథ్యంతో తీసుకున్న ఫోటోకు… ”చీకటిలో ఉన్నప్పటికీ కాంతిని ఆశిస్తున్నాను… అనే శీర్షికను ల‌క్ష్మిక జోడించింది. ఈ ట్యాగ్ లైన్- ఫోటోగ్రాఫ్ మ‌ర‌ణానికి ముందు ల‌క్ష్మికా ఆలోచ‌న‌ల‌ను ప్ర‌తిబింబిస్తున్నాయి. కొచ్చిలోని వజవేలిల్‌కు చెందిన లక్ష్మిక తన బహుముఖ ప్రతిభతో సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు. మరోవైపు షార్జాలోని బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తూ అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. పాతికేళ్ళు కూడా నిండ‌కుండానే అనంత లోకాల‌కు చేరిన లక్ష్మీకా సజీవన్ కు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Hero Chiranjeevi: మెగాస్టార్ ను కలిసిన నెట్ ఫ్లిక్స్ సిఈఓ

Lakshmika Sajeevan
Comments (0)
Add Comment