Beauty Lavanya Tripathi :లావ‌ణ్య త్రిపాఠి స‌తీ లీలావ‌తి

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ వేగ‌వంతం

Lavanya Tripathi : దుర్గాదేవి పిక్చ‌ర్స్ ప‌తాకం పై స‌తీ లీలావ‌తి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ స‌మ‌ర్పిస్తోంది. భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు, ఎస్ఎంఎస్ త‌దిత‌ర మూవీస్ కు క‌థ‌లు అందించిన తాతినేని స‌త్య తొలిసారిగా స‌తీ లీలావ‌తికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి షూటింగ్ శర వేగంగా కొన‌సాగుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు వేగం అందుకున్నాయి.

Lavanya Tripathi Movie Updates

ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ తో పాటు న‌టి లావ‌ణ్య త్రిపాఠి కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఈ చిత్రం షూటింగ్ ప్ర‌ధాన ప్రాంతాల‌లో రాకెట్ కంటే స్పీడ్ గా కొన‌సాగుతోంది. అధికారికంగా డ‌బ్బింగ్ ప‌నుల‌ను కూడా ప్రారంభించింది.

స‌తీ లీలావ‌తి మూవీని త్వ‌ర‌లోనే గ్రాండ్ గా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. నాగ మోహ‌న్ భారీ స్థాయిలో నిర్మిస్తుండ‌డం విశేషం. ఇక ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అద్భుత‌మైన మ్యూజిక్ ఇవ్వ‌డంతో పాటు ఆక‌ట్టుకునేలా స్వ‌రాలు కూర్చే ప‌నిలో ప‌డ్డాడు. సినిమాటోగ్ర‌ఫీని బినేంద్ర మీన‌న్ నిర్వ‌హిస్తుండ‌గా స‌తీష్ సూర్య ఎడిటింగ్ చేస్తున్నారు. మొత్తంగా స‌తీ లీలావ‌తిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : Beauty Samantha-Shubham :ఆశాజ‌న‌కంగా శుభ‌మ్ క‌లెక్ష‌న్స్

Lavanya TripathiMoviesUpdatesViral
Comments (0)
Add Comment