Pahalgam Attack :ప‌హ‌ల్గామ్ భూత‌ల స్వర్గం..ఉగ్ర‌దాడి దారుణం 

లియో మూవీ కెమెరామెన్ మ‌నోజ్ ప‌ర‌మహంస 

Pahalgam : యావ‌త్ ప్ర‌పంచం నివ్వెర పోయింది జ‌మ్మూ కాశ్మీర్ లోని ప‌హ‌ల్గామ్(Pahalgam) లో ఉగ్ర‌వాదులు ప‌ర్యాట‌కుల‌పై జ‌రిపిన దాడి. అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారంతా ముక్త‌కంఠంతో ఖండిస్తున్నారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక సినీ సెల‌బ్రిటీలంతా దాడి ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ త‌మిళ సినీ రంగానికి చెందిన కెమెరామెన్ మ‌నోజ్ ప‌రమహంస తీవ్రంగా స్పందించాడు. ఇది పూర్తిగా బాధాక‌ర‌మ‌ని, పూడ్చ లేని అగాధం అంటూ పేర్కొన్నాడు. ద‌ళ‌ప‌తి విజ‌య్ కీల‌క పాత్ర పోషించిన లియో చిత్రం మొత్తం పెహ‌ల్గామ్ ప్రాంతంలోనే చిత్రీక‌రించ‌డం జ‌రిగింద‌ని తెలిపాడు.

Pahalgam Terror Attack

ఒక ర‌కంగా భూత‌ల స్వ‌ర్గం అనేది ఉందంటే ఒక్క పెహ‌ల్గామ్ మాత్ర‌మేనంటూ స్ప‌ష్టం చేశాడు మ‌నోజ్ ప‌ర‌మ‌హంస‌. దాదాపు సినిమా షూటింగ్ మొత్తం ఇక్క‌డే చేయ‌డం జ‌రిగింద‌ని, మూడు నెల‌ల‌కు పైగా ఇక్క‌డే ఉన్నామ‌ని వెల్ల‌డించారు. కానీ ఇలాంటి ఘ‌ట‌న జ‌రుగుతుంద‌ని తాను క‌ల‌లో కూడా అనుకోలేద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా ఈ ప్రాంతంలోనే చాలా సినిమాల షూటింగ్ లు జ‌రిగాయి. వేస‌వి కాలంలో ఎక్కువ‌గా ఈ అందాల‌ను చూసేందుకు, ప్ర‌కృతి ఒడిలో సేద దీరేందుకు వేలాది మంది ప‌ర్యాట‌కులు వ‌స్తుంటార‌ని తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌తో తాను షాక్ కు గురైన‌ట్లు వాపోయాడు కెమెరామెన్ మ‌నోజ్ ప‌రమ‌హంస‌. ఆ ప్రాంత‌పు జ్ఞాప‌కాలు ఇంకా త‌మ‌ను వెంటాడుతూనే ఉన్నాయ‌న్నాడు. ఇక ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కూడ‌ద‌ని తాను దేవుడిని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపాడు. మ‌నోజ్ తో పాటు ఉగ్ర దాడిని ముక్తకంఠంతో ఖండించారు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ , రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, మహేష్ బాబు, జాన్వీ క‌పూర్, అలియా బ‌ట్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, త‌మ‌న్నా భాటియా, కీర్తి సురేష్, ర‌ష్మిక మంద‌న్నా.

Also Read : Beauty Anushka :ఒక్క మ‌గాడు చేసి ఉండాల్సింది కాదు

PahalgamTerror AttackUpdatesViral
Comments (0)
Add Comment