Lokesh Kanagaraj: కింగ్ నాగార్జున సీన్ లీక్‌ పై స్పందించిన లోకేష్ కనగరాజ్ !

కింగ్ నాగార్జున సీన్ లీక్‌ పై స్పందించిన లోకేష్ కనగరాజ్ !

Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘కూలీ’. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. నాగార్జున పార్ట్ కు సంబంధించి ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే కింగ్ నాగార్జున షూటింగ్‌ కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవడంతో… ఒక్కసారిగా యూనిట్ అలెర్ట్ అయింది. ఈ లీక్ పై సోషల్ మీడియా వేదికగా దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) రియాక్ట్ అవుతూ.. అలాంటి లీక్స్ చేయవద్దని వేడుకున్నారు.

Lokesh Kanagaraj Comment

‘ఒక్క లీక్‌తో రెండు నెలలుగా ఎంతో మంది పడిన కష్టం అంతా వృధా అయింది. దయచేసి ఎవరూ లీక్ సీన్‌ ని ప్రోత్సహించవద్దని కోరుతున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘కూలీ’ సినిమాలో సైమన్‌ గా కింగ్ నాగార్జున కనిపించనున్నారు. ఓ భారీ ఫైట్ సీన్‌కు సంబంధించిన వీడియోని సెట్‌ లోని వారు లీక్ చేశారు. ఆ విషయం ఆ లీక్డ్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. గుంపులో నుంచి వీడియోని ఫోన్‌ తో షూట్ చేసినట్లుగా తెలియడంతో… లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) టీమ్‌పై కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.

‘కూలీ’ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్‌ కి ఇది 171వ మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ వంటి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరింత స్టార్ పవర్‌ ను ఈ సినిమాకు జోడించడానికి, మేకర్స్ కింగ్ నాగార్జునను ఓ ప్రత్యేక పాత్రకు సెలక్ట్ చేశారు. కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్‌గా ఇటీవల ఆయన పాత్రను సైమన్‌ గా పరిచయం చేశారు. నాగ్ ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకుంది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

Also Read : Game Changer Update : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పై కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్

CoolieLokesh KanagarajNagarjuna AkkineniSuper Star Rajanikanth
Comments (0)
Add Comment