Lokesh Kanagaraj Sensational :లోకేష్ సంచ‌ల‌నం సోష‌ల్ మీడియాకు దూరం

కూలీ చిత్రం ప్ర‌మోష‌న్స్ కోసం కొంత కాలం

Lokesh Kanagaraj : త‌మిళ సినీ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్(Lokesh Kanagaraj). అద్భుత‌మైన టేకింగ్, మేకింగ్ లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చ‌డంలో త‌న‌కు త‌నే సాటి. త‌ను ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో మోస్ట్ పాపుల‌ర్ హీరో త‌లైవా ర‌జనీకాంత్ తో కూలీ మూవీని తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే హై రేంజ్ లోకి వెళ్లి పోయింది ఈ మూవీకి సంబంధించిన టాక్. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ , ట్రైల‌ర్ దుమ్ము రేపుతోంది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది కూలీ. ఎక్క‌డ చూసినా ర‌జ‌నీకాంత్ పేరు ఎక్కువ‌గా ప్ర‌చారంలో కొన‌సాగుతోంది.

Lokesh Kanagaraj Sensational Decision

ఇక కోలీవుడ్ ప‌రిశ్ర‌మ గురించి చెప్పాల్సి వ‌స్తే కోట్లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్నాడు త‌లైవా. ఆయ‌న‌కు ఈ దేశంలోనే కాదు ఇత‌ర దేశాల‌లో ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. జ‌పాన్ లో త‌నంటే ప‌డి చ‌స్తారు. ఇప్ప‌టికే త‌ను న‌టించిన జైల‌ర్ గ‌త ఏడాదిలో రికార్డ్ బ్రేక్ చేసింది. కాసుల వ‌ర్షం కురిపించింది. దీంతో స‌న్ పిక్చ‌ర్స్ అధినేత‌, ఎంపీ ద‌యానిధి మార‌న్ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించాడు. త‌ను ఊహించ‌ని రీతిలో ఆదాయం ఈ జైల‌ర్ ద్వారా వ‌చ్చింది. దీంతో ఇందులో ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ భారీ ధ‌ర‌తో కూడిన వాహ‌నాల‌ను బ‌హుమానంగా ఇచ్చాడు.

ప్ర‌స్తుతం ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా కూలీని నిర్మించాడు. అంద‌రి దృష్టి ఈ మూవీపైనే ఉంది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. సోష‌ల్ మీడియాకు గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు. కొంత కాలం పాటు తాను దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని తెలిపాడు. కూలీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాన‌ని అందుకే ఈ డెసిష‌న్ తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు.

Also Read : Arjun Son of Vyjayanthi Sensational :అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి సూప‌ర్ క‌లెక్ష‌న్స్

Lokesh KanagarajSensationUpdatesViral
Comments (0)
Add Comment