Popular Dir Lokesh Kanagaraj :సూర్య‌తో రోలెక్స్ మూవీ త‌ప్ప‌కుండా చేస్తా

స్ప‌ష్టం చేసిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్

Lokesh Kanagaraj : త‌మిళ సినీ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. న‌టుడు సూర్య‌తో త‌ప్ప‌కుండా రోలెక్స్ చిత్రం చేస్తాన‌ని త‌న మ‌న‌సులో బాట ప‌ట్టాడు. క‌చ్చితంగా ఉంటుంద‌న్నాడు. క‌న‌గ‌రాజ్ త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుల‌లో ఒక‌డిగా ఉన్నాడు. స్వ‌తంత్ర చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు తెలిపాడు. సూర్య న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం విక్ర‌మ్ లో పోషించిన పాత్ర రోలెక్స్. ఇదిలా ఉండ‌గా లోకేష్ క‌న‌గ‌రాజ్(Lokesh Kanagaraj) ప్ర‌స్తుతం బిజీగా ఉన్నాడు. త‌ను భారీ బ‌డ్జెట్ తో కూలీ పేరుతో మూవీ తీశాడు.

Lokesh Kanagaraj Comment

దీనిని త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నాడు. ఇందుకు సంబంధించి సినిమా ప్ర‌మోష‌న్స్ ను పెంచాడు. అంతే కాదు లోకేష్ క‌న‌గ‌రాజ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. తాను కొంత కాలం పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటాన‌ని ప్ర‌కటించాడు. కూలీ ప్ర‌మోష‌న్స్ లో ఉండ‌డం వ‌ల్ల ఈ డెసిష‌న్ తీసుకున్న‌ట్లు తెలిపాడు. ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ లో త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టాడు. ఖ‌చ్చితంగా రోలెక్స్ అనేది త‌ప్ప‌కుండా ఉంటుంద‌న్నాడు.

అయితే ఎప్పుడు వ‌స్తుందో త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. సూర్య‌తో క‌మిట్మెంట్ ఉంద‌న్నాడు. ఇదే స‌మ‌యంలో కైతి 2 కార్తీతో ఉంటుంద‌న్నాడు. ఇది పూర్త‌య్యాక సూర్య‌తో రోలెక్స్ సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఇక లోకేష్ క‌న‌గ‌రాజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను ద‌ళ‌ప‌తి విజ‌య్ తో మాస్ట‌ర్ తీశాడు. బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. లియో తీశాడు. ఇది సూప‌ర్ హిట్. క‌మ‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ తీశాడు. ఇది సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Also Read : Beauty Sree Leela :వేవ్స్ సంబురం శ్రీ‌లీల సంతోషం

CinemaCommentsLokesh KanagarajSuriyaViral
Comments (0)
Add Comment