Mad Square OTT Sensational :ఏప్రిల్ 25న నెట్ ఫ్లిక్స్ లో మ్యాడ్ స్క్వేర్

సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచిన మూవీ

Mad Square : సితార ఎంట‌ర్ టైన‌ర్ బ్యానర్ పై నిర్మాత నాగ‌వంశీ నిర్మించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఇది సీక్వెల్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంటిల్లి పాదిని అల‌రించేలా చేసింది. పాజిటివ్ టాక్ తో రిలీజ్ అయిన రోజు నుంచే రావ‌డంతో నిర్మాత‌కు సంతోషాన్ని మిగిల్చింది. భారీ ధ‌ర‌కు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ మ్యాడ్ స్క్వేర్ ను కొనుగోలు చేసింది. దీంతో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంద‌నే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌క పోయిన‌ప్ప‌టికీ ఈ నెల‌లోనే వ‌స్తుంద‌ని తెలిసింది. ఈ మేర‌కు 25న డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌కు ఆనందాన్ని పంచ‌డం ప‌క్కా అంటూ పేర్కొంది.

Mad Square OTT Sensational

మ్యాడ్ స్క్వేర్(Mad Square) మిస్ అయితే చాలా కోల్పోతారంటూ మూవీ మేక‌ర్స్ పేర్కొంటున్నారు. దీంతో మ‌రింత అంచ‌నాలు పెంచేలా చేశారు. ఇక మ్యాడ్ 2 థియేట‌ర్ల లోకి రాక ముందే నెట్ ఫ్లిక్స్ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ ప్రైజ్ కు స్వంతం చేసుకుంది. బ‌ల‌మైన ప్రారంభ క‌లెక్ష‌న్స్ , సానుకూల‌మైన మౌత్ టాక్ తో మ్యాడ్ మెప్పించింది. ఆశించిన దానికంటే ఎక్కువ ధ‌ర‌కు అమ్ముడు పోయింది. ఇందులో కీ రోల్ పోషించాడు నార్నే నితిన్. వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్నాడు.

జెర్సీ లాంటి అద్భుత చిత్రాన్ని నిర్మించిన నాగ‌వంశీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. మ్యాడ్ ప్ర‌యాణం ఇక్క‌డితో ఆగి పోదంటూ ప్ర‌క‌టించాడు. మ‌రిన్ని సీక్వెల్స్ వ‌స్తూనే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశాడు. అభిమానుల‌కు క‌చ్చితంగా ఆరోగ్య‌క‌ర‌మైన వినోదాన్ని అందిస్తామ‌ని తెలిపాడు. దీంతో థియేట‌ర్ ల‌లో చూడ‌ని వాళ్లు, ఇక కొద్ది రోజులు ఆగితే ఎంచ‌క్కా ఓటీటీలో చూసి త‌రించ‌వ‌చ్చు. వినోదాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు.

Also Read : Hero Akshay Kumar-Kesari 2 :అక్ష‌య్ కుమార్ కేస‌రి చాప్ట‌ర్ 2 సూప‌ర్

Mad SquareOTTUpdatesViral
Comments (0)
Add Comment