Mad Square Sensational :న‌వ్వుల న‌జ‌రానా మ్యాడ్ స్క్వేర్ ఖ‌జానా

తొలి షో నుంచే మూవీకి పాజిటివ్ టాక్

Mad Square : నువ్వా నేనా అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ సినిమాలు. ప్ర‌త్యేకించి సితార ఎంట‌ర్ టైన్మెంట్ ప‌తాకంపై నిర్మాత నాగ వంశీ నిర్మించిన మ్యాడ్ -2 సీక్వెల్ మాత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఇప్ప‌టికే పూర్తి ధీమాను వ్య‌క్తం చేశారు నిర్మాత‌. ఈ సినిమా ప‌క్కా స‌క్సెస్ అవుతుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించారు. దీన్ని బట్టి చూస్తే తొలి మూవీ కంటే ఈ సినిమా ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ చేసే ఛాన్స్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా న‌వ్వులే న‌వ్వులు. ప్రేక్ష‌కుల‌కు మంచి న‌జ‌రానా ఇచ్చారు ద‌ర్శ‌కుడు.

Mad Square Movie Sensational

స్టార్ ఇమేజ్ కంటే కథ ముఖ్య‌మ‌ని న‌మ్మిన నాగ వంశీ దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. అద్భుతంగా తెర కెక్కించారు ఈ మూవీని. ఎలాంటి ప్ర‌చారం లేకుండానే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. వ్యూస్ తో హీటెక్కి పోయింది. అస‌లే ఎండా కాలం కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు చ‌ల్ల‌టి ప్ర‌శాంత‌త‌ను , క‌డుపుబ్బా న‌వ్వుకునేలా చేసింది మ్యాడ్ స్క్వేర్(Mad Square) మూవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ లో తెరంగేట్రం చేశాడు. పూర్తిగా కాలేజీ నేప‌థ్యంలో వ‌చ్చింది. అది ఊహించ‌ని విధంగా స‌క్సెస్ కావ‌డంతో సీక్వెల్ ను పూర్తి చేశారు.

ఇందులో నార్నే నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూశారు. ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్ ను అభినందించ‌కుండా ఉండ‌లేం. తొలి 40 నిమిషాలు న‌వ్వులు కురిపించేలా చేశాడు. ఒకదాని తర్వాత ఒకటి ఫన్నీ సన్నివేశాలు..వరుసగా నవ్వించే క్షణాలతో, ప్రేక్షకులకు కథ గురించి ఆలోచించడానికి సమయం ఇవ్వలేదు. కేవ‌లం న‌వ్వుకోవ‌డానికి వ‌చ్చిన మూవీ కావ‌డంతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.

Also Read : Rashmika Buy Luxurious Car :ఖ‌రీదైన కారును కొనుగోలు చేసిన ర‌ష్మిక

CinemaMad SquareTrendingUpdates
Comments (0)
Add Comment