Mad Square Movie :మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ రిలీజ్

డేట్ ఫిక్స్ చేసిన మూవీ మేక‌ర్స్

Mad Square : బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్(Mad Square) సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్ , ట్రైల‌ర్ , పోస్ట‌ర్స్ కు పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది. తొలుత ఈ చిత్రాన్ని మార్చి 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని భావించారు మూవీ మేక‌ర్స్. ఊహించ‌ని రీతిలో రెస్పాన్స్ రావ‌డంతో మ‌రింత ఒత్తిడి మేర‌కు విడుద‌ల తేదీని ఓ తేదీ ముందుకు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Mad Square Movie Release Updates

పూర్తిగా న‌వ్వుల న‌జ‌రానాగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు క‌ళ్యాణ్ శంక‌ర్. ఈసారి కూడా సీక్వెల్ మూవీపై మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఈవెంట్ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ద‌మ్ముంటే త‌న సినిమా చూడాల‌ని, న‌వ్వులు పూయించ‌డం ఖాయ‌మ‌న్నారు.

ఒక‌వేళ న‌వ్వించ‌క పోతే మీరు తీసుకున్న టికెట్ల డ‌బ్బుల‌ను తిరిగి వాప‌స్ ఇస్తానంటూ ప్ర‌క‌టించాడు డైరెక్ట‌ర్. సినిమా తొలి షో నుంచే ఆద‌రించ‌డం ప‌క్కా అంటూ ధీమా వ్య‌క్తం చేశాడు. మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ మూవీపై భారీగా ఖ‌ర్చు చేశాడు నిర్మాత నాగ వంశీ.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈనెల 29న అమ‌వాస్య వ‌స్తోంద‌ని, అందుకే డిస్ట్రిబ్యూట‌ర్లు కొంద‌రు విడుద‌ల తేదీని వాయిదా వేయాల‌ని కోరార‌ని, అందుకే సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసిన‌ట్లు స్ప‌ష్టం చేశాడు.

Also Read : Director Boyapati- Akhanda 2 Fight :ఫైట్ సీన్స్ పై బోయ‌పాటి స్పెష‌ల్ ఫోక‌స్

Comments (0)
Add Comment