Maha Shivratri Srisailam Shocking :పోటెత్తిన భ‌క్త‌జ‌నం శివ నామ స్మ‌ర‌ణం

ఏపీ తెలంగాణ‌లో శివాల‌యాలు కిట‌కిట

Maha Shivratri : మ‌హా శివ రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌లోని ప్ర‌ముఖ శివాల‌యాల‌న్నీ భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతున్నాయి. క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుంచి శ్రీ‌శైలం(Srisailam) పుణ్య క్షేత్రానికి పోటెత్తారు. ఎక్క‌డ చూసినా భ‌క్తులే క‌నిపిస్తున్నారు. శివ రాత్రిని పుర‌స్క‌రించుకుని ఆల‌యాల‌లో విశిష్ట పూజ‌లు జ‌రుగుతున్నాయి. శివ నామ స్మ‌ర‌ణ‌తో మారు మ్రోగుతున్నాయి.

Maha Shivratri Shocking Cloud at Srisailam

ఏపీలోని శ్రీ‌శైలం, మ‌హానంది తెలంగాణ‌లోని వేముల‌వాడ‌, కీస‌ర‌గుట్ట , కాళేశ్వ‌రం, చెరువుగ‌ట్టు క్షేత్రాల‌న్నీ భ‌క్తుల‌తో నిండి పోయాయి. కిలోమీట‌ర్ల పొడ‌వునా వాహ‌నాలు నిలిచి పోయాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ సంస్థ‌లు పెద్ద ఎత్తున బ‌స్సుల‌ను న‌డుపుతున్నాయి. భ‌క్తులు ఇంకా కాలి న‌డ‌క‌న శ్రీ‌శైలానికి చేరుకుంటున్నారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఆల‌య క‌మిటీ ఏర్పాట్లు చేసింది. నంద్యాల జిల్లా క‌లెక్ట‌ర్ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

శివాల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌ల‌తో పాటు రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఉపవాస దీక్షలతో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వేముల వాడ‌కు 4 ల‌క్ష‌ల మందికి పైగా వ‌స్తార‌ని అంచ‌నా వేసింది స‌ర్కార్. పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. విజ‌య‌వాడలోని కృష్ణా న‌ది భ‌క్తుల‌తో నిండి పోయింది. స్నానాలు చేసి స‌మీప శివాల‌యాల‌కు వెళుతున్నారు.

Also Read : Victory Venkatesh Movie :సంక్రాంతికి వ‌స్తున్నాం హిందీ రీమేక్

Maha ShivratriSrisailamUpdatesViral
Comments (0)
Add Comment