Mahesh Babu : ఆ సినిమాకి చిన్న కేమియో రోల్ లో కృష్ణుడిగా సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా....

Mahesh Babu : మహేశ్‌బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్‌ టైటిల్‌లో ఓ చిత్రం రూపొందించనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌, పాన్‌ వరల్డ్‌ స్థాయిలో పాపులర్‌ అయిన ఆర్టిస్ట్‌లతో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. అయితే ఈ సినిమా 2025 జనవరిలో ప్రారంభమై, 2029లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ నాలుగేళ్లు వెయిట్ చేయాలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న ఓ వార్త మహేష్(Mahesh Babu) అభిమానులకు భారీ ఉపశమనాన్ని కలిగిస్తోంది.

Mahesh Babu Movie Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా.. ప్రస్తుతం ‘దేవకి నందన వాసుదేవ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో కామియో రోల్ లో మహేష్(Mahesh Babu) సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ సమాచారం 100% కరెక్ట్ అయితే మహేష్ ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పాలి. ‘ దేవకి నందన వాసుదేవ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్.. కృష్ణుడి గెటప్‌లో కనిపించనున్నడా అనే టాక్ కూడా మొదలైంది. దీంతో పైన కనిపిస్తున్న ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది. మరోవైపు కొత్త టెక్నాలజీతో కనులు చెదిరే గ్రాఫిక్స్‌తో వెండితెరను కలర్‌ఫుల్‌ చేసే జక్కన్న ఈ చిత్రం కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నాడట. ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేయడానికి పలు క్లాసులకు హాజరవుతున్నారు.

మరోవైపు అశోక్ రెండేండ్ల క్రితం హీరో వంటి బ్లాక్‌బ‌స్టర్ మూవీ త‌ర్వాత సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా రూపొందిన కొత్త చిత్రం ’దేవకి నందన వాసుదేవ’. వారణాసి మానస కథానాయికగా నటిస్తోంది. దీనికి హను-మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా తమ్మిరాజు బాధ్యతలు నిర్వహించారు.

Also Read : Meenakshi Chaudhary : నేను ప్లానింగ్ ప్రకారమే ప్రాజెక్టులు చేస్తాను

Mahesh BabuMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment