Hero Mahesh Babu :26న మ‌హేష్ భ‌ర‌త్ అనే నేను రీ రిలీజ్

టాలీవుడ్ లో మొద‌లైన కొత్త ట్రెండ్

Mahesh Babu : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొత్త ట్రెండ్ మొద‌లైంది. ఆయా సినిమా స్టార్లు న‌టించి బిగ్ స‌క్సెస్ అయిన సినిమాలు తిరిగి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఇందులో కొన్ని మూవీస్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌గా మ‌రికొన్ని చిత్రాలు విచిత్రంగా ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ ల‌లో స్ట్రీమింగ్ అవుతుండ‌డం విశేషం. ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ హీరోగా పేరు పొందాడు. త‌న కెరీర్ లో చాలా సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. వాటిలో కృష్ణ‌వంశీ తీసిన మురారి. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తీసిన అత‌డు, పూరీ జ‌గన్నాథ్ తీసిన పోకిరి, శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందించిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, కొర‌టాల శివ తీసిన భ‌ర‌త్ అనే నేను(Bharath Ane Nenu), శ్రీ‌మంతుడు ఉన్నాయి.

Mahesh Babu Movie Bharath Ane Nenu Re-release..

అంతే కాదు మ‌హేష్ బాబును గొప్ప‌గా చూపించేలా చేసిన సినిమా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒక్క‌డు చిత్రం. ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ మూవీగానే నిలిచి పోయింది. ఈ త‌రుణంలో కొన్ని సినిమాలు రీ రిలీజ్ చేయాల‌ని చిత్ర నిర్మాత‌లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది ప్రిన్స్ మూవీ గురించి. బిగ్ స‌క్సెస్ గా నిలిచి, కాసులు కురిపించిన భ‌ర‌త్ అనే నేను మూవీని రీ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 26న తిరిగి ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటూ తెలిపారు.

ఈ చిత్రం భారీ విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఇందులో మ‌హేష్ బాబు అద్భుత‌మైన పాత్ర ను పోషించాడు. త‌న గురించి చెప్పాలంటే ప్రిన్స్ ద‌ర్శ‌కుల హీరో. చిన్న వ‌య‌సులోనే సీఎంగా కొలువు తీరిన మ‌హేష్ బాబు ఎలా హ్యాండిల్ చేశాడ‌నేది ఈ చిత్రంలోని ప్ర‌త్యేక‌త‌. ముఖ్య‌మంత్రి పాత్ర పోషిస్తూనే ఇంకో వైపు ల‌వ్ లో ప‌డ‌తాడు. చివ‌ర‌కు ఏం చేస్తాడు. సీఎంగా స‌క్సెస్ అయ్యాడా లేక ప్రేయ‌సి వ‌ల‌లో ప‌డి ప‌ద‌విని పోగొట్టుకున్నాడా అనేది చూడాలంటే భ‌ర‌త్ అనే నేను మూవీ చూడాలి.

Also Read : Thalapathy Vijay Shocking -Fatwa :ద‌ళ‌ప‌తి విజ‌య్ పై క‌న్నెర్ర ఫ‌త్వా జారీ

bharath Ane NenuMahesh BabuRe-ReleaseTrendingUpdates
Comments (0)
Add Comment