Mahesh Babu : ప్రిన్స్ మ‌హేషా మ‌జాకా

ఫిట్ నెస్ సెంట‌ర్ లో క‌స‌ర‌త్తు

Mahesh Babu : టాలీవుడ్ లో ప్రిన్స్ మ‌హేష్ బాబు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వ‌య‌సు పెరిగినా ఆయ‌న ఇంకా చిన్న పిల్లాడిలా ఉంటారు. ఆక‌ట్టుకునే క‌ళ్లు, ఎవ‌రి మ‌న‌సు నొప్పించ‌కుండా మాట్లాడ‌టం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య. భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్న ఈ న‌టుడు ప్ర‌స్తుతం ఫుల్ గా జిమ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.

Mahesh Babu in Workout

మహేష్ బాబు ప్ర‌స్తుతం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు కారం సినిమాలో న‌టిస్తున్నాడు. ఆయ‌న‌కు జోడీగా ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల న‌టిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ శ‌ర వేగంగా కొన‌సాగుతోంది.

సినిమాలో భాగంగా మ‌రింత ఫిట్ గా క‌నిపించేందుకు గాను మ‌హేష్ బాబు(Mahesh Babu) పూర్తిగా జిమ్ పై ఫోక‌స్ పెట్టారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్రిన్స్. ఇక త్రివిక్ర‌మ్ , మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రం మూడోది.

గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో అత‌డుతో పాటు ఖ‌లేజా మూవీ వ‌చ్చింది. తెలుగు సినిమా రంగంలో అత‌డు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అప్ప‌టి వ‌ర‌కు సాఫ్ట్ గా ఉన్న మ‌హేష్ బాబును మ‌రీ వ‌య‌లెంట్ గా తీసి చూపించాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ప్ర‌స్తుతం రాబోయే గుంటూరు కారం మ‌రింత కారాన్ని ఎక్కించేలా ఉందంటున్నారు.

Also Read : Jawan Trailer : బుర్జ్ ఖ‌లీఫాలో బాద్ షా సంద‌డి

Comments (0)
Add Comment