Mahesh Babu: మహేశ్ బాబును భయపెడుతున్న క్యూట్ జిమ్ ట్రైనర్

మహేశ్ బాబును భయపెడుతున్న క్యూట్ జిమ్ ట్రైనర్

Mahesh Babu : వయసుతో పాటు అందం కూడా పెరుగుతాందా అని అనిపించే… అతి తక్కువ మంది హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటారు. 48 ఏళ్ళ వయసులో కూడా మహేశ్… 20 ఏళ్ళ యువకుడిలా కనిపిస్తారు. దీనికి కారణం మంచి డైట్ ఫాలో అవుతూ… కఠోరమైన వ్యాయామాలు చేయడం. దీనితో వయసు పెరుగుతున్న కొద్దీ మహేశ్ యవ్వనంగా కనిపిస్తున్నారు. అంతటి ఫిట్ నెస్ సంపాదించాలంటే సాధారణ జిమ్ ట్రైనర్లతో సాధ్యం కాదు అనేది అందరికీ తెలిసిన సత్యం. దీనితో మహేశ్ బాబు జిమ్ ట్రైనర్ ఎవరా అనే ఆశక్తి అతని అభిమానులతో పాటు సాధారణ యువకుల్లో కూడా ఉంటుంది. అయితే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మహేశ్ బాబు పరిచయం చేసిన తన క్యూట్ జిమ్ ట్రైనర్… ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాడు.

Mahesh Babu – తన క్యూట్ జిమ్ ట్రైనర్ ను పరిచయం చేసిన మహేశ్ బాబు

అవకాశం దొరికినప్పుడల్లా జిమ్ వర్కవుట్స్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చూపించే మహేశ్ బాబు… తాజాగా తన జిమ్ ట్రైనర్‌ను పరిచయం చేస్తూ ఓ క్యూట్ ఫోటో షేర్ చేసాడు. దీనితో ఆ క్యూట్ జిమ్ ట్రైనర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేశ్ బాబు(Mahesh Babu) షేర్ చేసిన ఆ పిక్‌లో.. మహేష్ జిమ్‌లో వర్క్‌అవుట్‌లు చేస్తుండగా, ఎదురుగా తన పెంపుడు కుక్క ‘స్నూపీ’ కూర్చుని మహేష్‌ని తధేకంగా చూస్తోంది. అంతేకాదు “మీ పుషప్స్ లెక్కపెట్టడానికి ఇలాంటి క్యూట్ ట్రైనర్ ఉంటే… మీకు విశ్రాంతి ఉండదు” అంటూ కామెంట్ పెట్టాడు. దీనితో మహేష్ బాబుకి జిమ్‌లో ట్రైనింగ్ ఇచ్చే క్యూట్ ట్రైనర్ “స్నూపీ” నా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఫ్లూటో చనిపోవడంతో స్నూపీను పెంచుతున్న సూపర్ స్టార్

గతంలో మహేశ్ బాబు ఇంట్లో ఫ్లూటో అనే పెంపుడు కుక్క ఉండేది. అయితే అది అనారోగ్యంతో చనిపోవడంతో… మహేశ్ ‘స్నూపీ’ని మరో కుక్కను పెంచుకుంటూ…. స్నూపీతో ఉన్న ఫొటోలను తరచూ తన అభిమానులతో పంచుకుంటున్నాడు.

సంక్రాంతి కానుకగా మహేశ్-త్రివక్రమ్ ల ‘గుంటూరు కారం’

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం కసరత్తు చేస్తోంది. ఇది ఇలా ఉండగా మహేశ్ నెక్స్ట్ సినిమాను రాజమౌళితో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Also Read : Mahesh Babu: యంగ్ హీరోయిన్ తో మహేశ్ బాబు మాస్ స్టెప్స్

Guntur karamMahesh Babu
Comments (0)
Add Comment