Hero Mahesh Babu Son :పాకిస్తాన్ పాప‌తో ప్రిన్స్ స‌న్ వైర‌ల్ 

దేశ వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న..ఆందోళ‌న 

Mahesh Babu : ఈ ఏడాది స్టార్ హీరో మ‌హేష్ బాబుకు అంత‌గా అచ్చొచ్చిన‌ట్టు లేదు. అన్నీ వివాదాలే వెంటాడుతున్నాయి. రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లకు ప్ర‌చారం చేయ‌డం, వారి నుంచి రూ. 5 కోట్ల‌కు పైగా డ‌బ్బులు తీసుకోవ‌డంపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఝ‌ల‌క్ ఇచ్చింది. విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌మ‌న్లు జారీ చేసింది. దీని నుంచి త‌ప్పించుకునేందుకు మనోడు తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని, త‌న‌కు వేరే తేదీ కావాలంటూ ఓ లేఖ రాశాడు. త‌ను ఫ్యామిలీతో క‌లిసి ఇత‌ర ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తున్నాడు.

Mahesh Babu Son Viral with Pakistan Girl

కానీ విచార‌ణ‌కు రావాలంటే మాత్రం దూరంగా ఉండ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇది ఇలా ఉండ‌గా మ‌హేష్ బాబు(Mahesh Babu) త‌న‌యుడు గౌత‌మ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ప్ర‌స్తుతం భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు జ‌మ్మూ కాశ్మీర్ లోని పహ‌ల్గామ్ లో ప‌ర్యాట‌కుల‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో 26 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో భార‌త ప్ర‌భుత్వం పాక్ పై యుద్దం ప్ర‌క‌టించింది.

ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి మహేష్ బాబు కొడుకు పాకిస్తాన్ కు చెందిన అమ్మాయితో చెట్టా ప‌ట్టాల్ వేసుకుని తిర‌గ‌డం, చ‌నువుగా ఉన్న వీడియోలు, ఫోటోలు వైర‌ల్ గా మారాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓ వైపు యుద్దం జ‌రుగుతుంటే ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అంటూ మండిప‌డుతున్నారు. దేశం ప‌ట్ల కాస్తంత గౌర‌వం కూడా లేని ఇలాంటి వారిని ఎందుకు ఆరాధిస్తున్నారో అర్థం కావ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా స్పందిఒంచ లేదు ప్రిన్స్ ఫ్యామిలీ.

Also Read : Hero Sharwanand 38 :రూటు మార్చిన శ‌ర్వానంద్ మాస్ రోల్
Mahesh BabuSonUpdatesViral
Comments (0)
Add Comment