Mahesh Babu: అభిమానులతో కలిసి ‘గుంటూరు కారం’ చూసిన మహేష్ బాబు !

అభిమానులతో కలిసి ‘గుంటూరు కారం’ చూసిన మహేష్ బాబు !

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సుదర్శన్ థియేటర్ లో సందడి చేసారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను తాజాగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమాను అభిమానులతో కలిసి సుదర్శన్ థియేటర్ లో వీక్షించారు. దీనితో సుదర్శన్ థియేటర్ వద్ద కోలాహాలం నెలకొంది. తమ అభిమాన నటుడుతో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మహేష్ బాబు… థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున అతనితో కరచాలనం చేయడానికి ప్రయత్నించారు. దీనితో అక్కడ కాస్తా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Mahesh Babu With Fans

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవరాం విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రమణ పాత్రలో మహేష్ బాబు మాస్‌లుక్‌ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, శ్రీ లీల డ్యాన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినట్లు అభిమానులు చెబుతున్నారు.

Also Read : Guntur Kaaram Review : గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అంటున్న ప్రేక్షకులు

Guntur KaaramMahesh Babu
Comments (0)
Add Comment